కాన్సులేట్‌లో సూపర్‌స్టార్ ఫ్యాన్

అమెరికా వీసా కోసం మీరు ఇంటర్వ్యూకి వెళ్లగానే కౌంటర్‌ వద్ద ఉన్న అమెరికన్‌ అధికారి నమస్కారం, అమెరికాలో మీ బంధువులు ఉన్నారా, అక్కడికి వెళ్లి ఎంత కాలం ఉంటారు అని తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఇదే తీరులో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

వీసాకు భాష అడ్డంకి కాకూడదనేది అమెరికా ప్రభుత్వ సిద్ధాంతం. అందుకే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. అందుకే హైదరాబాద్‌ లోని అమెరికన్ కాన్సులేట్‌ అధికారులకు ప్రస్తుతం తెలుగు, హిందీలో తర్ఫీదు ఇస్తున్నారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే కాన్సులేట్‌ అధికారులు తొలిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ని ప్రశంసలతో ముంచెత్తారు.

వారిలో కెల్లి అనే అధికారిని మాట్లాడుతూ మాకు చాలా తెలుగు సినిమాలు చూపించేవారు. నాకు శిక్షణలో ఉన్నప్పటి నుంచి నటుడు మహేష్ బాబు అంటే ఇష్టం. ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తానని మహేష్ కి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. ఆయన అందం, నటన, ఆహార్యం, భాష విధానం అద్భుతం అని, అందుకే అతడి సినిమాలే చూపించమని అడిగేదాన్ని అని అలానే మరికొందరు కూడా అయన చిత్రాలు చూపించమని అడిగేవారని అన్నారు.

అమెరికాలో మాకు ఇచ్చిన శిక్షణ వల్ల భాష ఎలా ఉంటుంది, ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, అనే విషయాలు తెలిశాయి. ఇప్పటికే వైవిధ్యమైన సినిమాలతో అభిమానులను సంపాదించిన సూపర్ స్టార్ ఇలాంటి అభిమానులను కూడా సంపాదించటం నిజంగా చాలా గొప్ప విషయం.

తండ్రి లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు చిన్నతనం లోనే అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అలానే హీరో గా తొలి చిత్రం రాజకుమారుడు తో సూపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయనకున్న అభిమానగనం అంతా ఇంతా కాదు.

కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఆయనకు వీరాభిమానులున్నారు. అతడు చిత్రం తో ఆయన తెలుగు చిత్రాల స్టామినా ను ఓవర్సీస్ మార్కెట్ కు చూపించారు. తదుపరి ఆయన నటించిన ప్రతి చిత్రం మంచి రెవిన్యూ తో అక్కడ దూసుకెళ్లాయి. మరీ ముఖ్యంగా ఆయన నటించిన కొన్ని ప్లాప్ చిత్రాలు కూడా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు సాధించాయి.

Share

Leave a Comment