ఈ ఉగాది మరింత స్పెషల్

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంను మొదట సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ మంగళవారం ప్రకటించింది.

నో మోర్‌ డౌట్స్‌. మరోసారి సమ్మర్‌కి సై అని, వచ్చే ఏడాది ఉగాది రుచులను థియేటర్స్‌లో చూపిస్తాం అంటున్నారు మహేష్‌. ‘ఈ ఏడాది ఉగాది ఇంకాస్త స్పెషల్‌గా ఉండబోతుంది. 2019 ఏప్రిల్‌ 5న మహేష్‌25 సినిమా విడుదల కానుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘భరత్‌ అనే నేను’ చిత్రం దున్నేసింది.

గతంలోనూ మహేష్‌ కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌గా నిలిచిన ‘పోకిరి’ కూడా ఏప్రిల్‌లోనే రిలీజైందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే సమ్మర్‌ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేసి, భారీ వసూళ్లను సాధించాలని భావిస్తున్నారు. ఉగాది రోజే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మహేష్‌25’ చిత్రం ఏ రేంజ్‌ రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.

అసలే మహేష్ 25వ సినిమా. సెంటిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా దీన్ని ల్యాండ్ మార్క్ మూవీగా మలిచే ప్రయత్నంలో డెడ్ లైన్ పెట్టుకుని తొందరపడకుండా నెమ్మదిగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారట. సినిమా స్టార్ట్ చేసిన 15 రోజుల్లోనే విడుదల డేట్ ను ప్రకటించడం విశేషం.

అంటే సుమారు తొమ్మిది నెలల్లో సినిమా విడుదలకు రెడీ అవుతుందన్నమాట. అయితే ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించబోతున్నారు. మహేష్‌బాబు, అల్లరి నరేష్‌ కాంబో సీన్స్‌ ఎలా ఉంటాయి, అసలు వీరిద్దరు సినిమాలో ఎలా కనిపిస్తారు అంటూ సోషల్‌ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. రవి పాత్రలో నరేష్‌ నటిస్తున్నారని సమాచారమ్‌. మహేష్‌, నరేష్‌, పూజా క్లాస్‌మేట్స్‌గా కనిపిస్తారట. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో కాలేజీ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట. భరత్ అనే నేను తర్వాత దేవి శ్రీ ప్రసాద్ మరోసారి మహేష్ కు స్వరాలు సమకూరుస్తున్నారు.

Share

Leave a Comment