రొమేనియాలో ‘స్పైడర్‌’ పాట చిత్రీకరణ

spyder-romania

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్‌ వున్న పాట చిత్రీకరణ రొమేనియాలో ఆగస్ట్‌ 25న ప్రారంభమైంది. ఆగస్ట్‌ 31 వరకు ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

Share

Leave a Comment