మనసులో మాట..

తెలుగు యువ హీరో సుధీర్ బాబు తన దైన శైలి లో కొత్త కధలతో మంచి హిట్స్ సాధిస్తూ ముందుకు వెల్తున్నాడు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహేష్ బాబు తో ఒక్క సినిమా అయినా నిర్మాతగా చేయాలని అది కూడా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో చేయాలనీ అదే తన డ్రీమ్ అని తెలిపారు.

సమ్మోహనం చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి టాలెంట్ కు ఫిదా అయిపొయాను అని సుధీర్ తెలిపారు. మోహన్ కృష్ణ దర్శకుడుగా, మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు సుధీర్ బాబు.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు స్టోరీని అందంగా చెప్పడంలో మాస్టర్. ఈ తరం నటులంతా ఒక్కసారైనా ఇతనితో పనిచేయాలి. ఇతను మహేష్ బాబుతో సినిమా చేస్తే అది తప్పకుండా అద్భుతమైన సినిమా అవుతుంది అని తెలిపారు.

మరి మహేష్ బాబు దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.నేను ఎప్పుడూ ఇండిపెండెంట్‌గా ఎదగాలని అనుకుంటాను. నా యాక్టింగ్ కెరీర్ చూస్తే పక్కన కృష్ణగారు, మహేష్ వున్నా ఏదో వాళ్ళను వాడేసుకోని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు.

ఐ వాంట్ టు గ్రో ఇండిపెండెంట్‌లీ. అందులో నాకు శాటిస్‌ఫ్యాక్ష‌న్‌ ఎక్కువ వుంటుంది. నేను సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి అదే రీజన్. ఏదో ఒక రోజు నేను ప్రొడక్షన్ చేసే స్టేజి వుంటే కొత్తవాళ్ళను కొంతమందిని తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నా.

అలాగే స్టార్ట్ చేశా. తప్పకుండా మహేష్ తో ఒక సినిమా తీస్తాను అని సుధీర్ బాబు ఆశాభావం వ్యక్తం చేసారు. మహేష్ బావ గా నాకు దగ్గరే కానీ. యాక్టర్‌ గా కాస్త గ్యాప్‌ ఉండేదనిపించేది. ఈ సినిమా ఓ యాక్టర్‌గా నన్ను తనకు దగ్గర చేసింది.

ఇప్పుడు నా గురించి మాట్లాడేటప్పుడు బావ మహేష్ బాబు కళ్లలో మెరుపు కనిపిస్తోంది అని సుధీర్ ఆనందంగా చెప్పాడు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌ కు కేవలం మాములు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా మంచి ఫాలోయింగి ఉంది.

అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు వచ్చే నూతన నటీమనుల నుంచి వేరే భాష లో నటిస్తున్న అగ్ర హీరోయిన్స్ వరకు అందరికి మన టాలివూడ్ లో సుపరిచితమైన పేరు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ 27వ సినిమా త్వరలో సెట్స్ కి వెల్లనుంది.

ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట.

Share

Leave a Comment