ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేస్తా

‘మన చుట్టూ చాలామంది ప్రతిభావంతులున్నారు. కొరియోగ్రాఫర్లు, పాటలు రాసేవాళ్లు, నటీనటులు ఎంతో టాలెంట్‌ ఉండి కూడా ఇక్కడ అవకాశాల కోసం తిరగలేక వెళ్లిపోయిన వాళ్లున్నారు. నేను ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేస్తే బావుంటుందనిపించి చేశా. చాలా మంది వచ్చి కలుస్తూనే ఉన్నారు’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు.

ఆయన హీరోగా, అదితీరావు హైదరీ హీరోయిన్‌గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ మహేష్ బాబుతో ఒక్క సినిమా అయినా నిర్మాతగా చేయాలని, అది కూడా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో చేయాలనీ అదే తన డ్రీం అని తెలిపారు సుధీర్ బాబు.

సమ్మోహనం చిత్రానికి దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటితో పనిచేసిన సంగతి తెలిసిందే. మంచి కథ ఉంటే ఇంద్రగంటిగారి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు స్టోరీని అందంగా చెప్పడంలో మాస్టర్.

ఈ తరం నటులంతా ఒక్కసారైనా ఇతనితో పనిచేయాలి. ఇంద్రగంటి మహేష్ బాబుతో సినిమా చేస్తే అది తప్పకుండా అద్భుతమైన సినిమా అవుతుంది అని తెలిపారు. మరి దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇక సమ్మోహం గురించి మాట్లాడుకుంటే అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించగా, ఒక సినిమా స్టార్ కి, మాములు ప్రేక్షకుడికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందో తెలిపేలా ఈ సినిమా ఉండనుంది. ప్రవీణ్‌ సత్తార్‌గారి దర్శకత్వంలో చేయనున్న పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం అవుతుంది. నా తర్వాతి సినిమా మా సంస్థలోనే ఉంటుంది. ఆర్‌.ఎస్‌.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తున్నా.

‘సమ్మోహనం’ వంటి ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీ ఇప్పటిదాకా చేయలేదు. ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదు. ‘ఏమాయ చేసావె’ కూడా వేరు.‘సమ్మోహనం’లో ఫన్, రొమాన్స్‌ ఉంటుంది. ఈ చిత్రంలో హరీశ్‌ శంకర్, అవసరాల శ్రీనివాస్, తరుణ్‌ భాస్కర్‌గారు మాత్రమే గెస్ట్‌ రోల్స్‌ చేశారు. హీరోలెవరూ చేయలేదు అని చెప్పారు సుధీర్.

Share

Leave a Comment