సుక్కూ మాటల్లో

సుకుమార్ లేటేస్ట్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ఆయన ప్రస్తావించారు. “మహేష్ బాబు తో చేసిన ‘1 నేనొక్కడినే’ సరిగా ఆడలేదు కదా, సో సినిమా ఫెయిల్ అయినప్పుడు మీరెలా ఫీలయ్యారు?” అనే ప్రశ్న సుకుమార్ కి ఎదురైంది. అందుకాయన ఈ విధంగా స్పందించారు.

“1 నేనొక్కడినే సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకున్నాను. అలా జరగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. చాలా ఆలోచించి తెలుగు లో ఇప్పటివరకు రానటువంటి సినిమా తీసి అందించాలని తాపత్రయ పడ్డాను. మొదటి నుంచి కూడా నేను సినిమా తీసే విధానం చాలా కష్టతరంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయలేను. ఒక సినిమా చేస్తున్నంత సేపు నా యొక్క మనసంతా దానిపైనే ఉంటుంది.

నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఒక సినిమా కోసం పడిన కష్టమంతా మరిచిపోయి సంతోషంగా ఉండేది అది హిట్ అయిన రోజునే. అది హిట్ కాకపోతే మనసుకి ఇంకా కష్టంగా అనిపిస్తుంది. ‘1 నేనొక్కడినే’ సినిమా అలాంటి బాధకి నన్ను గురిచేసింది. సినిమా చాలా అధ్బుతంగా చిత్రీకరించాం కాని ఇంకొక్క పది రోజులు ఎడిటింగ్ మీద కూర్చుని ఉంటే అందరికి అర్ధం అయ్యేలా చేసేవాడిని.

ఇందులో ప్రజలని కూడా నిందించలేను. నాదే పూర్తి బాధ్యత. మహేష్ గారు ప్రాణం పెట్టీ చేసారు. అంత గొప్ప స్టార్ నన్ను నమ్మి నాకు చాన్స్ ఇస్తే హిట్ ఇవ్వలేకపోయానే అనె అనుకుంటూ ఉంటాను. తప్పులు రిపీట్ చేయకుండా ఈ సారి అందరికీ అర్దం అయ్యేలా నా మార్క్ లో తీసి విజయం అందిస్తాను ” అని చెప్పుకొచ్చారు.

నిజానికి ‘1 నేనొక్కడినే’ కథ విషయంలో ఇంకో వెర్షన్ కూడా ఉందని.. దాని ప్రకారం ఇంటర్వెల్ వరకు హీరో డ్రామా ఆడి ఉంటాడని.. అతను ప్లే చేసిన విషయం విరామం దగ్గర తెలుస్తుందని.. ఆ వెర్షన్ పెట్టి ఉంటే హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేదని.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేవని.. ఐతే హీరోయిజం కంటే ఎమోషన్ ముఖ్యం అనే ఉద్దేశంతో తాను వేరే వెర్షన్లో సినిమా తీశానని సుకుమార్ చెప్పాడు.

ఒకవేళ పాత వెర్షన్ కూడా చిత్రీకరించి రెంటినీ పోల్చుకుని ఉంటే అదే సినిమాలో పెట్టేవాడినేమో.. అప్పుడు సినిమా వేరే ఫలితాన్ని అందుకునేదేమో అని సుకుమార్ అభిప్రాయపడ్డాడు.​ మహేష్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తెలుగు సినిమాలని హాలివుడ్ లెవెల్ లో తీయొచ్చు అని అందరికి తెలియజెప్పిన చిత్రం.

అయితే మళ్లీ మహేష్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. నేడు సుకుమార్‌ బర్త్‌డే సందర్భంగా మహేష్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘మోస్ట్‌ హంబుల్‌, సూపర్‌ టాలెంటెడ్‌ సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను సర్‌’ అని అన్నారు.

1 నేనొక్కడినే చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైన మహేష్ తో హిట్ సాధించాలనే దృఢ నిశ్చయంతో సుక్కు ఉన్నాడు. అంచనాలకి తగ్గట్టే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారి బడ్జెట్ తో తెరక్కించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధపడుతున్నారు. కథలో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నాను, ఇంకా మెరుగులు దిద్దుతున్నాము అని సుకుమార్ చెప్పారు.

Share

Leave a Comment