క్రేజీ ప్రాజెక్టు గురించి సుక్కూ క్లారిటి

దర్శకులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సినిమాలు చేసే హీరోలలో మహేష్ మొదటి స్థానం లో ఉంటారు. డైరక్టర్ ఏం చెప్పినా నో చెప్పకుండా తను నూరు శాతం ఇస్తాడు ప్రిన్స్. అంత విపరీతంగా నమ్మిన దర్శకులలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్, సూపర్‌స్టార్ మహేష్‌ బాబు కలయికలో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి.

మహేష్ కెరీర్‌లో 26వ సినిమాకు సుకుమార్ డైరెక్టర్ కావడం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు మైత్రీ మూవీస్ కసరత్తు చేస్తున్నది. మహేష్, సుకుమార్ మధ్య ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయిన విషయం తెలిసిందే. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే రాసే పనిలో సుకుమార్ ఇప్పుడు బిజీ అయ్యాడు.

మహేష్ ఇమేజ్‌కు తగిన విధంగా సుకుమార్ కథను రూపొందించనట్టు తెలుస్తున్నది. కొత్త కథ తో తనదైన శైలి లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా పక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుక్కు. ఒకవైపు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకుంటూనే.. మరోవైపు సాంకేతిక వర్గాన్ని, నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో మునిగిపోయాడు.

ఒక స్ట్రెయిట్ నేరేషన్ తో కమర్షియల్ లైన్ వినిపించా అని సుకుమార్ స్వయంగా ఇంటర్వ్యూ లో తెలిపారు. కథలో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నాను, ఇంకా మెరుగులు దిద్దుతున్నాము అని చెప్పారు. ప్రేక్షకులు మెచ్చేలా ఒక థ్రిల్లింగ్ స్టోరీ సుకుమార్ రెడీ చేస్తున్నారట.

గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైన మహేష్ తో హిట్ సాధించాలనే దృఢ నిశ్చయంతో సుక్కు ఉన్నాడు. అంచనాలకి తగ్గట్టే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారి బడ్జెట్ తో తెరక్కించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధపడుతున్నారు. ఈ సినిమా నటీనటుల వివరాలు, టైటిల్‌ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం వంశీ పైడిపల్లితో మహర్షి సినిమా షూటింగ్ లో బిజీ ఉన్న మహేష్ దాని తర్వాత సుకుమార్ తో చేస్తాడు. మహేష్ తన 25వ సినిమా కోసం డిఫరెంట్ ఛేంజోవర్ తో అందరికీ కనిపించి అదరగొట్టేశాడు. ‘మహర్షి’ టీమ్ అమెరికాకు ప్రయాణం అవుతోందట. న్యూ యార్క్, న్యూ జెర్సీ తదితర నగరాలలో షూట్ జరుగుతుందని సమాచారం. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట.

Share

Leave a Comment