1 నేనొక్కడినే.. ఇంకో వెర్షన్ ఉందట

దర్శకులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సినిమాలు చేసే హీరోలలో మహేష్ మొదటి స్థానం లో ఉంటారు. డైరక్టర్ ఏం చెప్పినా నో చెప్పకుండా తను నూరు శాతం ఇస్తాడు ప్రిన్స్. మహేష్ – సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ బాక్సాఫీస్ లెక్కల పరంగా అంతగా ఇంపాక్ట్ చూపలేకపోయినా విమర్శకులని సైతం మెప్పించింది. కథ విషయంలో సుకుమార్ వినూత్న పాయింట్ ని ఎంచుకున్నాడు.

కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన వైనం తెలుగు తెర మీద చాలా అద్భుతంగా ఆవిష్కరించడంలో విజయం సాదించారు. అందులో బలమైన కంటెంట్ ఉంటుంది. గొప్ప సినిమాగా అభివర్ణిస్తారు క్రిటిక్స్. కాకపోతే ఆ చిత్రాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. ఈ చిత్రం విడుదలై ఈరోజు తో 5సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో మరోసారి సుకుమార్ గారి మాటలని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ఈ సినిమా విషయంలో తాను ఎప్పటికీ చింతిస్తూనే ఉంటానని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ తెలిపారు. ఒక బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమా తన వల్లే ఫ్లాప్ అయిందేమో ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుందని సుకుమార్ చెప్పాడు. ‘1 నేనొక్కడినే’ విషయంలో తన వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయని సుకుమార్ చెప్పాడు.

ఎడిటింగ్ టేబుల్ దగ్గర కొంచెం కఠినంగా వ్యవహరించానని.. నిడివి తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని సీన్లు తీసేస్తూ పోయానని.. చిన్న చిన్నవే అయినప్పటికీ వాటిని తీసేయడంతో కథ సంక్లిష్టంగా మారిందని.. ప్రేక్షకులకు సినిమా అర్థం కాకుండా పోవడానికి అది కూడా ఒక కారణమేమో అని సుకుమార్ చెప్పాడు.

నిజానికి ‘1 నేనొక్కడినే’ కథ విషయంలో ఇంకో వెర్షన్ కూడా ఉందని.. దాని ప్రకారం ఇంటర్వెల్ వరకు హీరో డ్రామా ఆడి ఉంటాడని.. అతను ప్లే చేసిన విషయం విరామం దగ్గర తెలుస్తుందని.. ఆ వెర్షన్ పెట్టి ఉంటే హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేదని.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేవని.. ఐతే హీరోయిజం కంటే ఎమోషన్ ముఖ్యం అనే ఉద్దేశంతో తాను వేరే వెర్షన్లో సినిమా తీశానని సుకుమార్ చెప్పాడు.

ఒకవేళ పాత వెర్షన్ కూడా చిత్రీకరించి రెంటినీ పోల్చుకుని ఉంటే అదే సినిమాలో పెట్టేవాడినేమో.. అప్పుడు సినిమా వేరే ఫలితాన్ని అందుకునేదేమో అని సుకుమార్ అభిప్రాయపడ్డాడు.​ మహేష్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తెలుగు సినిమాలని హాలివుడ్ లెవెల్ లో తీయొచ్చు అని అందరికి తెలియజెప్పిన చిత్రం.

ఇక మరోసారి మహేష్ కోసం సుక్కు అదిరిపోయే కథను, స్క్రిప్ట్ ను రెడీ చేశారట. అలాగే మహేష్ కు వినిపించడం కూడా జరిగిపోయిందట. ఈ కథ మహేష్ కు చాలా బాగా నచ్చిందని, ప్రాజెక్ట్‌ పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారని టాక్‌. సుక్కు చెప్పిన కథకు మహేష్ ఫిదా అయ్యాడని తెలుస్తోంది. సుక్కూ కథ పూర్తి స్థాయి ప్రిపరేషన్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పనులు మొదలెట్టారని సమాచారం.

గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైన మహేష్ తో హిట్ సాధించాలనే దృఢ నిశ్చయంతో సుక్కు ఉన్నాడు. అంచనాలకి తగ్గట్టే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారి బడ్జెట్ తో తెరక్కించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధపడుతున్నారు. కథలో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నాను, ఇంకా మెరుగులు దిద్దుతున్నాము అని చెప్పారు.

మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయన నటనకు ఆయనే మైలురాళ్ళు పెట్టుకుంటూ వాటిని ఆయనే అధిగమిస్తూ వచ్చారు. కొన్ని పాత్రలు ఈయన కోసమే రాస్తారేమో అన్నట్టు అయన నటించారు. కథలో ఉన్న ఇంటెన్సిటీ ని చివరి వరకు అయన నటనతో ఎక్కడ మిస్ అవ్వకుండా చేయడం లో ఈయన మిస్టర్ పర్ఫెక్ట్.

ప్రస్తుతం తన 25 వ చిత్రం మహర్షి కోసం తనని కాలేజ్ కుర్రాడిగా మారిపొమ్మని వంశీ పైడిపల్లి సూచించగానే సన్నని గడ్డం, నూనూగు మీసంతో కనిపించి పెద్ద షాకిచ్చారు మన సూపర్ స్టార్. 1 నేనొక్కడినే టైమ్ లో లుక్ తో పోలిస్తే ఈ లుక్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. మహర్షి చిత్రీకరణ ప్రస్తుతం వేగంగా పూర్తవుతోంది.

ఇప్పుడు సెకండ్ లుక్ తో మరోసారి సినిమాపై అంచనాలు మరింత పెంచారు. ఇంకా చెప్పాలంటే హాలివుడ్ హీరో లా కనిపిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. మహేష్‌ పాత్ర మనసుకి హత్తుకునేలా ఉండబోతోందని, స్నేహం, ప్రేమ, త్యాగం.. ఈ అంశాల చుట్టూ ఈ సినిమా సాగనుందని సమాచారం. చాలా ప్రేస్టేజియస్‌గా తెరకెక్కిస్తున్నాడు వంశీ పైడిపల్లి.

Share

Leave a Comment