అందరు మెచ్చేలా ఉంటుందన్నసుక్కు

బ్లాక్‌బస్టర్‌లో దర్శకుడు సుకుమార్, ప్రిన్స్ మహేష్‌బాబు కలయికలో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. మహేష్ కెరీర్‌లో 26వ సినిమాకు సుకుమార్ డైరెక్టర్ కావడం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు మైత్రీ మూవీస్ కసరత్తు చేస్తున్నది.

మహేష్ ఇమేజ్‌కు తగిన విధంగా సుకుమార్ కథను రూపొందించనట్టు తెలుస్తున్నది. కొత్త కథ తో తనదైన శైలి లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా పక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుక్కు అండ్ టీం.

ఒక స్ట్రెయిట్ నేరేషన్ తో కమర్షియల్ లైన్ వినిపించా అని సుకుమార్ స్వయంగా ఇంటర్వ్యూ లో తెలిపారు. కథ లో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నాను, ఇంకా మెరుగులు దిద్దుతున్నాము అని చెప్పారు.

ఇది వరకు చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు మెచ్చేలా ఒక థ్రిల్లింగ్ స్టోరీ సుకుమార్ రెడీ చేస్తున్నారట. సుకుమార్ ఈ చిత్రంతో ఎలాగైనా సూపర్ స్టార్ కి ఒక మంచి హిట్ ఇవ్వాలని కసితో ఉన్నట్లు తెలుస్తోంది.

అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నారు. అంచనాలకి తగ్గట్టే ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా భారి బడ్జెట్ తో తెరక్కించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధపడుతున్నారు. ఈ సినిమా నటీనటుల వివరాలు, టైటిల్‌ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

భరత్ అనే నేను సక్సెస్ తో ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటానన్న మహేష్ దానికి తగ్గట్టే తొందరపడకుండా నెమ్మదిగా వెళ్తున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లితో తన 25వ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్న మహేష్ దాని తర్వాత సుకుమార్ తో చేయనున్నాడు. అందరికి మెచ్చేలా మహేష్ ని చూపిస్తాను అంటున్న సుకుమార్ సినిమాను ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో చూడాలి మరి.

Share

Leave a Comment