ఇంటరెస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో

దర్శకులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సినిమాలు చేసే హీరోలలో మహేష్ మొదటి స్థానం లో ఉంటారు. డైరక్టర్ ఏం చెప్పినా నో చెప్పకుండా తను నూరు శాతం ఇస్తాడు ప్రిన్స్. అంత విపరీతంగా నమ్మిన దర్శకులలో సుకుమార్ కూడా ఒకరు.

1నేనొక్కడినే విషయంలో మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని అందుకే ఇప్పుడు మరోసారి ప్రిన్స్ తో వర్క్ చేసి ఆయనకి సక్సెస్ ఇవ్వాలనుందని ఇటీవలే ఇంటర్వ్యూలో చెప్పారు సుకుమార్. ఈ సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న తన సిల్వర్ జూబ్లీ 25 ల్యాండ్‌మార్క్ సినిమా త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ చిత్రాన్ని సుకుమార్‌తో చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ రీసెంట్ గా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొద‌లు పెట్టారని సమాచారం.

మహేష్, సుకుమార్ మధ్య ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయిన విషయం తెలిసిందే. సుకుమార్ చెప్పిన మూడు స్టోరీలైన్స్ లో ఒక లైన్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే రాసే పనిలో సుకుమార్ ఇప్పుడు బిజీ అయ్యాడు.

ఓ నెల రోజుల్లో ఫస్ట్ డ్రాఫ్ట్ ను మహేష్ కు వినిపించబోతున్నారని సమాచారం. సుకుమర్ రైటర్స్ టీం అంతా ఇప్పుడు మహేష్ కోసం ఇంటరెస్టింగ్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నారు. ఒకవైపు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకుంటూనే.. మరోవైపు సాంకేతిక వర్గాన్ని, నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో మునిగిపోయాడు.

గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైన మహేష్ తో హిట్ సాధించాలనే దృఢ నిశ్చయంతో సుక్కు ఉన్నాడు. ఇప్పుడు చేయబోయే ఈ ప్రాజెక్టును మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరొందిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

మరో సారి కొత్త కథ తో తనదైన శైలి లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా పక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నరు సుక్కు ఆండ్ టీం. సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి త‌న సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌నే కంటిన్యూ చేస్తున్నాడు.

Share

Leave a Comment