మహేష్ కోసం రెడీ చేస్తున్నారు

దర్శకులను మహేష్ బాబు విపరీతంగా నమ్మేస్తాడు. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సినిమాలు తీస్తాడు. మహేష్ అంత విపరీతంగా నమ్మిన దర్శకులలో సుకుమార్ కూడా ఒకరు. 1నేనొక్కడినే విషయంలో మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని.. రంగస్థలం సక్సెస్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు సుకుమార్.

చెప్పినట్టుగానే మహేష్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించి పని ప్రారంభించాడు సుకుమార్. మొన్నటివరకు తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామంలో కొన్ని రోజులు గడిపిన సుకుమార్.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాడు.

మహేష్ ఓకే చెప్పిన స్టోరీలైన్ పై పని ప్రారంభించాడు సుకుమార్. ఓ నెల రోజుల్లో ఫస్ట్ డ్రాఫ్ట్ ను మహేష్ కు వినిపించబోతున్నాడు. సుకుమర్ రైటర్స్ టీం అంతా ఇప్పుడు మహేష్ కోసం ఇంటరెస్టింగ్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నారు.

మహేష్, సుకుమార్ మధ్య ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయిన విషయం తెలిసిందే. సుకుమార్ చెప్పిన మూడు స్టోరీలైన్స్ లో ఒక లైన్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే రాసే పనిలో సుకుమార్ ఇప్పుడు బిజీ అయ్యాడు.

త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు మహేష్ బాబు. ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే సుకుమార్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో స్క్రీన్ ప్లేను ఓ కొలిక్కి తీసుకురాబోతున్నారు.

‘మహేష్, నేను మంచి ఫ్రెండ్స్. మా సినిమాల విజయాలతో మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. విభజించు-పాలించు అనే సూత్రం ఇక్కడ పనిచేయదు. మేమంతా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం. కలిసికట్టుగానే పనిచేస్తాం. మా సినిమాల ద్వారా లాభాలొస్తే అది పరిశ్రమ బాగుకే ఉపయోగపడుతుంది’ అని రామ్ చరణ్ రీసెంట్ గా చెప్పారు.

ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో ప్రయోగాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే, ఆ ప్రయోగాలకి బ్రాండ్ అంబాసిడర్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. నిజానికి ఆ గట్సే మహేష్ బాబును ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పవచ్చు.

ఇప్పటివరకు మహేష్ పోషించని ఓ సరికొత్త పాత్రను సృష్టించాడట సుకుమార్. రంగస్థలంకు విలేజ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్న సుక్కూ, మహేష్ మూవీకి అర్బన్ బ్యాక్ డ్రాప్ సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టు రాబోతోంది.

Share

Leave a Comment