స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా

సూపర్ స్టార్ మహేష్ బాబు వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తన 26వ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అనౌన్స్మెంట్ కూడా చేసింది. అయితే ఇదివరకు మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రం భారీ అంచనాలతో విడుదలయి పరాజయాన్ని అందుకుంది.

అందులో మహేష్ బాబు ఒక మానసిక వ్యాధితో బాధపడే యువకుని పాత్రని పోషించారు. సుకుమార్ ఆ చిత్రానికి రాసుకున్న కథ మంచి బలమైనది అయినప్పటికీ, దానిని తెరపై చూపించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా మహేష్ అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలేవీ లేకపోవడం కూడా మరొక పెద్ద మైనస్.

అయితే తాను చేసిన పొరపాటు వల్లనే వన్ నేనొక్కడినే చిత్రం ప్లాప్ అయిందని సుకుమార్ ఇదివరకు పలుమార్లు చెప్పారు. అందుకని ఈ సారి మహేష్ తో చేయబోయే చిత్రానికి సుకుమార్ మంచి కమర్షియల్ అంశాలున్న కథ రాసుకున్నారని, అంతే కాదు ఎటువంటి కంఫ్యూషన్ లేని ఒక థ్రిల్లింగ్ స్టోరీ అని వార్తలు వస్తున్నాయి.

కొత్త కథ తో తనదైన శైలి లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా పక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుక్కు అండ్ టీం. సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి త‌న సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌నే కంటిన్యూ చేస్తున్నారు.

సుకుమార్ ఈ చిత్రంతో ఎలాగైనా సూపర్ స్టార్ కి ఒక మంచి హిట్ ఇవ్వాలని కసితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబందించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొన్నాళ్ల తర్వాత చిత్ర యూనిట్ ప్రకటించనుందట. ఈ సినిమా ముహూర్తం దసరాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అనేది మహెష్ 25వ సినిమాపై ఆధారపడి ఉంది.

మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. మ‌హేష్ 25వ సినిమా పూర్తయ్యే లోపు పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు కనక ప్లానింగ్ లో ఎక్కడా తేడా రాకుండా సెట్ చేసుకుంటున్నారట సుకుమార్.

Share

Leave a Comment