నీకే కాదు ఆయన నా ఫేవరెట్ కూడా

తొలి సినిమాతోనే కొత్త పంథాలో సాగే రచయిత, దర్శకుడు, హీరో అయ్యాడు. ఎవరి గురించబ్బా అనుకుంటున్నారా? ‘క్షణం’ తీరిక లేకుండా ‘గూఢచారి’లా కష్టపడే అడవి శేషు గురించి. టాలీవుడ్ లో అతి పెద్ద మోస్ట్ పాపులర్ ఫ్యామిలీస్‌లో అక్కినేని వాళ్లది ఒకటి. అలాంటి కుటుంబంలో పుట్టి సొంత టాలెంట్ తో హీరో అయి తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్.

వీరిద్దరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అందరూ ఫాలో అయ్యే మూస సినిమాల ధోరణి కి వీరిరువురు చాలా దూరం. ఎప్పుడు ఎదో ఒకటి కొత్తగా చేయలానే తపన వీరిలో ఉంది. అందుకే ఏమో ఇద్దరికి సూపర్‌స్టార్ కృష్ణ గారు అంటే అమితమైన ఇష్టం మరియు గౌరవం.

దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అడివి శేష్ ట్వీట్ చేశారు. “నాకెంతో స్ఫూర్తినిచ్చిన తెలుగు సినీ పరిశ్రమలో ఒరిజినల్ ట్రెండ్ సెట్టర్. గూఢచారి116 తో గూఢచారి. ఆయన్ని మరోసారి కలవడం గౌరవంగా భావిస్తున్నాను. సూపర్ స్టార్.. లెజెండ్’ అంటూ కృష్ణ గారిని కలిసిన ఫొటోను అడివి శేష్ ట్వీట్ చేశారు.

ఇప్పుడే కాదు ఇంతకుముందు అనేక సందర్భాలలో కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్తూనే వచ్చాడు అడివి శేష్. సుమంత్ ఆ ట్వీట్ ని కోట్ చేసి వండర్‌ఫుల్ క్లిక్ బ్రో.. సూపర్‌స్టార్ కేవలం నీకే కాదు.. నా చిన్నతనం నుండి నా ఫేవరట్ హీరో కూడా అంటూ ట్వీట్ చేసారు.

నాకు మా తాతయ్య ఏ.ఎన్.ఆర్ గారి కంటే కూడా సూపర్‌స్టార్ కృష్ణ గారి సినిమాలు నచ్చుతాయి. ఆయనకి వీరభిమానిని. అంటే మా తాతయ్య అడిగితే చిన్నప్పుడు భయంతో మీ సినిమాలు ఇష్టం ఇంక బాలివుడ్ లో అమితాబ్ ఇష్టం అని చెప్పేవాడిని కాని నిజంగా అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ గారి గారి సినిమాలంటే ఎగబడి చూసేవాడిని అని సుమంత్ తెలిపారు.

అడివి శేష్ కూడా గూడచారి సినిమా కి ప్రేరణ పొందింది కృష్ణ గారిని చూసే అని తెలిపాడు. కౌ బాయ్‌ సినిమాలు, జేమ్స్‌బాండ్‌ సినిమాల్ని పరిచయం చేసిన కృష్ణగారి ప్రభావం నాపైన చాలా ఉంది. దాంతో గూఢచారి సినిమాలో కథానాయకుడికి 116 అనే నంబర్‌ ఇచ్చాం. ఇందులో మీరొక పాత్ర చేయాలని కృష్ణ సార్‌ని అడిగా.

ఆయన ఇప్పుడు నేను నటించడం లేదమ్మా అన్నారు. మీ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని వాడుకొంటానని చెబితే సరే అన్నారు అని తెలిపాడు శేష్. అక్కినేని ఫ్యామిలీ లో చాలా మంది సూపర్ స్టార్ మహేష్ ను ఇష్టపడతారు. ప్రస్తుతం ఎంత మంది హీరో లు ఉన్నా విత్ అవుట్ ఎనీ డౌట్ మహేష్ బాబు ఇష్టం అని సుమంత్ తెలిపారు.

మహేష్‌బాబు సినిమాల్ని చూస్తుంటా. ఎప్పుడూ డిఫెరెంట్‌గా, సూపర్‌గా ఉంటాయి అని సుశాంత్ ఇదివరకే తెలిపారు. నాగార్జున మహేష్ కు కూడా మంచి రిలేషన్ ఉంది. ఇక అఖిల్ చాలా సందర్భాలలో తన ఫ్యావెరెట్ హీరో మహేష్ అనే చెప్పారు. నాగ చైతన్య కూడా చాలా సార్లు మహేష్ సినిమాలు ఎక్కువగా చూస్తా అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

ఒక్కో జెనరేషన్ కి ఒక్కో సూపర్ స్టార్ ఉంటాడు. ఈ జెనరేషన్ తెలుగులో సూపర్ స్టార్ మాత్రం మహేష్ బాబు. ఆయన తెలుగులో మాత్రమే సూపర్ స్టార్ అనుకుంటే పొరపాటే. ఒక్క తెలుగులోనే కాదు మహేష్ క్రేజ్ చాలా చోట్ల ఎవరికీ సాధ్యం కాని విధంగా ఉంది. విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న యాక్టర్ మహేష్.

మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. 25వ చిత్రం కావడంతో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించడమే కాకుండా సబ్జెక్ట్ విషయంలోనూ ఫ్రెష్ నెస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటి కంటే ది బెస్ట్‌గా ఇందులో మహేష్ బాబు పాత్ర ఉంటుందట. చాలా యంగ్ గా, రఫ్ లుక్ లో ఆకట్టుకున్నారు మన సూపర్ స్టార్.

Share

Leave a Comment