ఏఎన్ఆర్ గారికి మహేష్ చాలా ఇష్టమట

టాలీవుడ్ లో అతి పెద్ద ఫ్యామిలీస్‌లో అక్కినేని వాళ్లది ఒకటి. అలాంటి మోస్ట్ పాపులర్ కుటుంబంలో పుట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్. రొటీన్ కాన్సెప్ట్స్ కాకుండా వెరైటీ కథలను ఎంచుకునే సుమంత్ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించాలని చూస్తాడు.

మహేష్ బాబు నిన్న 106 ఏళ్ళ బామ్మ గారిని కలిసిన విషయాన్ని వెల్లడిస్తూ మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటోని పంచుకున్నారు. దానికి సుమంత్ స్పందిస్తూ “పెద్ద వారందరికీ నువ్వంటే అమితమైన ప్రేమ, మా తాత గారికి కూడా నువ్వంటే చాలా ఇష్టం మహేష్” అని తెలిపారు.

ఆ తరం ఈ తరం అని తేడా లేకుండా నిన్ను అందరూ ఇష్టపడతారు. ఫ్యామిలీస్ ఆండ్ వృద్ధులకి నీ పైన అమితమైన ప్రేమ ఉంటుంది. మా తాత నాగేశ్వరరావు గారికి కూడా నీ జెనరేషన్ హీరోలలో అందరకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అని నాకు చెప్పేవారు అని సుమంత్ ట్వీట్ చేసాడు.

అక్కినేని ఫ్యామిలీ లో చాలా మంది సూపర్ స్టార్ మహేష్ ను ఇష్టపడతారు. ఎంత మంది హీరో లు ఉన్నా నేను మహేష్ ఫ్యాన్ ని అని సుమంత్ చాల సార్లు చెప్పారు. ఎక్కువగా మహేష్‌బాబు సినిమాల్ని చూస్తుంటా అని సుశాంత్ ఇదివరకే తెలిపారు. నాగార్జున మహేష్ కు కూడా మంచి రిలేషన్ ఉంది. ఇక అఖిల్ చాలా సందర్భాలలో తన ఫ్యావెరెట్ హీరో మహేష్ అనే చెప్పారు.

” ఏళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది.

ఆమె తన అభిమానంతో నా హృదయాన్ని గెలుచుకున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది” అని పోస్ట్‌లో పేర్కొన్నారు మహేష్‌‌.

ఒక్కో జెనరేషన్ కి ఒక్కో సూపర్ స్టార్ ఉంటాడు. తెలుగులో సూపర్ స్టార్ మాత్రం మహేష్ బాబు. ఆయన తెలుగులో మాత్రమే సూపర్ స్టార్ అనుకుంటే పొరపాటే. ఒక్క తెలుగులోనే కాదు మహేష్ క్రేజ్ చాలా చోట్ల ఎవరికీ సాధ్యం కాని విధంగా ఉంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ కలిగిన ఒకే ఒక ప్రాంతీయ భాష స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

మహేష్ తన మొదటి సినిమా నుంచి ఓ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. సినిమా హిట్ అవుతుందా లేదంటే ప్లాప్ అవుతుందా అనే విషయాన్ని పక్కన పెట్టి తన శక్తినంతా ఉపయోగించి చిరునవ్వుతో పనిచేస్తుంటారు. బాగా వచ్చేవరకు ఎన్ని టేక్ లైనా చేస్తారు.

మహేష్ బలం ఆ చిరునవ్వే. ఆ చిరునవ్వుతోనే సెట్స్ లో అందరిని ఆకట్టుకుంటాడని తనతో పని చేసిన దర్శక నిర్మాతలు, నటీనటులు చెప్పే మాట. మహేష్ ఒక నవ్వు నవ్వితే చాలు, ఎంత స్ట్రెస్‌లో ఉన్నా కూడా యూనిట్ మొత్తంలో కొత్త ఉత్సాహం వస్తుందని అందరూ ఏకగ్రీవంగా తెలుపుతారు. వర్క్ పట్ల మహేష్ కి ఉన్న డిడికేషన్ అలాంటిది.

Share

Leave a Comment