ఆ ప్రభంజనానికి సాటి లేదు..!

లక్షల్లో అభిమానులు, సూపర్‌ స్టార్‌డమ్‌ ఆండ్ నేషనల్‌ వైడ్‌ ఫాలోయింగ్ ఆయన సొంతం. మహేష్ బాబు అనే పేరు చుట్టూ ఉన్న ప్రపంచం ఇంత పెద్దది. ఖలేజా తరువాత ఫ్యాన్స్ అంతా చాలా ఆతురతగా ఒక కమర్షియల్ సినిమా కోసం చూస్తున్న సమయం అది. సరిగ్గా ఆ టైం లోనే ఎవరూ ఊహించని కాంబినేషన్ సెట్ అయింది.

కమర్షియల్ చిత్రాలకు హాస్యాన్ని జోడించి విజయాలు అందుకోవడం ఆ దర్శకుడి ప్రత్యేకత. అటువంటి దర్శకుడికి మన సూపర్‌స్టార్ వంటి హీరో దొరికితే చెప్పేదేముంది. మహేష్ బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన దూకుడు అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసి ఒక సంచలనంగా మారింది.

కుటుంబ విలువ‌లు, ప్రేమ‌, ప్ర‌తీకారం, హాస్యం ఇలా అన్ని అంశాల‌ను మేళ‌వించి తెర‌కెక్కించిన ఈ చిత్రం విజ‌య‌ఢంకా మోగించ‌డమే కాదు, ప‌లు పుర‌స్కారాల‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడమే కాకుండా డైలగ్స్ పరంగా కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలించింది. వాటిల్లో కొన్ని మీకోసం..

* భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది : ఈ చిత్రం తో తన దూకుడేంటో చూపించాడు సూపర్‌స్టార్. ఇన్నాళ్ళూ మహేష్ డైలాగులు అంటే పోకిరి,అతడు గుర్తుకు వచ్చేవి..అలాంటిది దూకుడుతో డైలాగులకు తిరిగి అంతే క్రేజ్ తీసుకురావడం కేవలం సూపర్‌స్టార్ కే చెల్లింది.

* ఒక్కొక్కడి బల్బులు పగిలి పోవాలి : రాసింది రచయితే అయినా, వాటిని మహేష్ చెప్పే విధానంలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. తనదైన శైలిలో మహేష్ ఈ డైలాగ్ చెప్పిన తీరు..ఆ ఇంటెన్సిటీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే జనాల్లోకీ అంత తొందరగా రీచ్ అయింది ఈ డైలాగ్. సన్నివేశం పరంగా కూడా చాలా ఎలివేట్ చేసింది ఈ డైలాగ్

* దిస్ ఈజ్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిజ్ ఈజ్ ఆల్ టైం రికార్డ్ : నాకు ఒక్క నిముషం టైమిస్తే ఆలోచిస్తా, రెండు నిముషాలు టైమిస్తే యాక్షన్లో దిగుతా, మూడు నిముషాలు టైమిస్తే ముగించేస్తా అని విలన్ సోను సూద్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో ఈ డైలాగ్ వచ్చి మహేష్ స్టామినాని ఒక్క మాటలో చెప్పి కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ ని నమోదుచేసింది.

* నీ కలర్ ఏంటి? నా కలర్ ఏంటీ? ఎదవ పిట్ట మొహం ఏసుకుని : భుమికి జానెడు లేవు.. ఏంటే నీ యెదవ కాంఫిడెన్సూ….నేను పక్కన నిలుచుంటే ఫస్ట్ ఫ్లోర్ వాడిని చూసినట్టు ఇలా చూస్తున్నావ్.. అసలు నీ కలర్ ఏంటి..నా కలర్ ఏంటి..ఎదవ పిట్ట మొహం ఏసుకుని.. కామిక్ డైలాగ్ విపరీతంగా ప్రాచుర్యం చెందింది.

* మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతాను : దూకుడు లో చెప్పిన ఈ పంచ్ డైలాగ్ చిన్నా పెద్దా, అభిమానులు సాధారణ ప్రేక్షకులు అని తేడా లేకుండా జనాల నోట్లో ఇప్పటికీ నానుతూనే ఉంది. మహేష్ మార్కు మాడ్యులేషన్ వలన అంతాగా ప్రాచుర్యం చెందింది.

* కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు…దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు : అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. ప్రతీ డైలాగ్ సన్నివేశానికి అనుగునంగానే ఉంటూనే దాన్ని అమాతం ఎలివేట్ చేసాయి.

* ఈ దూకుడే లేకపోతే పోలీస్ మెన్ కీ పోస్ట్ మెన్ కి తేడా ఏముంటుంది : ఇందులో మహేష్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా కనిపించే బాడీ లాంగ్వేజి కరెక్టుగా సెట్ అవ్వడమే కాక పోలీస్…అంటు చెప్పే డైలాగ్ తో పాటు ఇలా పోలీస్ కి ఉండాల్సిన గట్స్ గురించి చెప్పడం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

* మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు ‘సాహసమే ఊపిరిగా బతికేవాడికి దానితో పనిలేదు దమ్ముతోనే పని : ఇక్కడ ఈ డైలాగ్ వింటే అభిమానులందరికీ సూపర్‌స్టార్ కృష్ణ గారి డేరింగ్ ఆండ్ డాషింగ్ ఆటిట్యూడ్ గుర్తొస్తుంది. మహేష్ కూడా తండ్రి బాటలోనే అటువంటీ స్క్రిప్ట్స్ నే ఎన్నుకుంటూ కొత్తదానాన్ని ఇస్తున్నందుకు కరెక్టుగా సెట్ అయింది ఈ డైలాగ్.

* షేర్.. బబ్బర్ షేర్.. నేను నరకడం మొదలుపెడితే నరకంలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టుకోవాలి రా: మహేష్ మరో సారి తనదైన శైలి యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో దూకుడును ప్రత్యేకంగా నిలిపాడు. సినిమా అంతా మహేష్ ఒన్ మెన్ షో తోనే నడించింది. షేర్.. బబ్బర్ షేర్ అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది.

Share

Leave a Comment