మీ అందరిని గర్వపడేలా చేస్తా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై..చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

కొద్దీ సేపటి క్రితమే మహేష్ తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా థాంక్స్ తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా గడిచిన రాత్రి భరత్ బహిరంగ సభకు హాజరైనందుకు మీ అందరికి చాలా పెద్ద థాంక్స్.

మీ అందరిని అలా చూడటం నాకు సంతోషంగా ఉంది. ఇన్నేళ్ళుగా నాపై మీరు చూపిస్తున్న ప్రేమ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో మీరంతా హాజరై, గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

మీ అందరిని ఏప్రిల్ 20న థియేటర్లలో కలుసుకుంటా. మీ అందరిని గర్వపడేలా ఈ సినిమా చేస్తుందని తెలిపారు.నా సినిమాల్లో నేను అత్యున్నతమైన పర్ఫార్మెన్స్ కనబరిచిన సినిమా ఇది. నా కరీర్ లో ఒక టర్నింగ్‌ పాయింట్‌గా భావిస్తున్నానని మహేష్‌ పేర్కొన్నారు.

అభిమానుల ఆనందం చూస్తుంటే ఇది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లా లేదని, 100 రోజుల ఫంక్షన్‌లా అనిపిస్తోందని మహేష్‌ అన్నారు. తమ్ముడు తారక్ ఈవెంట్ కి వచ్చి మా మధ్య ఉన్న సాన్నిహిత్యం ని మీ అందరికి తెలియజేసారు అని కొనియాడారు.

మహేష్ బాబు ఇందులో సీఎం పాత్రలో కనిపిస్తుండడంతో ఆరంభం నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ చేసిన ట్రైలర్, ఆడియో సూపర్ హిట్టై రిలీజ్ పై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు తరువాత మహేష్ చేసిన రెండో సినిమా కావడం కూడా పెద్ద అసెట్ గా నిలవనుంది. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఈ సినిమా ఏప్రిల్ 20 మా అమ్మ ఇందిరమ్మ గారు పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనలకు మించినవేవీ ఉండవంటారు! ఆ రోజున నా సినిమా విడుదలకానుండటం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని
మహేష్ అన్నారు.

Share

Leave a Comment