విరాళంతో గొప్ప మనసు చాటుకున్నారు

పేదలే ఆప్తులుగా వసుదైక కుటుంబంగా సాగుతున్న సేవా సంస్థ ‘మనం సైతం’లో నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చారు సూపర్‌స్టార్ కృష్ణ. ఆయన సతీమణి గిన్నీస్ బుక్ రికార్డ్స్ హోల్డర్, దర్శకురాలు విజయనిర్మలతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ ‘మనం సైతం’కు విరాళం అందజేశారు. కృష్ణ, విజయనిర్మల చెరో 2 లక్షల రూపాయలు ‘మనం సైతం’కు అందజేశారు.

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్లానెట్ 10లో గల కృష్ణ స్వగృహంలో మనం సైతం సభ్యులు కృష్ణ దంపతులను కలిశారు. ఈ సందర్భంగా ఐదుగురు ఆపన్నులకు మనం సైతం ఆర్థిక సహాయం అందించింది. లైట్ మెన్ ప్రవీణ్ కుమార్, చిరుద్యోగి ఎస్ రాజేందర్, ప్రసాద్ ల్యాబ్స్‌లో పనిచేసే బాయ్ దుర్గారావు, ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్‌గా పనిచేసే రాజ్ కుమార్ కొడుకు సోమేశ్వర్, రచయిత ప్రాణమిత్ర తదితరులు ఆర్థిక సహాయం పొందిన వాళ్లలో ఉన్నారు.

వీళ్లలో కొందరికి అనారోగ్య చికిత్సకు, మరికొందరి చదువులకు ఆర్థిక సహాయం అందజేశారు. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మలమ్మ గార్ల చేతుల మీదుగా లైట్ మెన్ ప్రవీణ్ కుమార్( కార్డు 633)కి 25,000 అందజేసారు. అతనికి పాపపుట్టింది. ఊపిరి తిత్తుల్లో లోపం ఉందట,తల్లికి కూడా బాలేదు. 4 నెలలుగా జీతాలు ఇవ్వని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూన్న రాజేంద్రరెడ్డి పిల్లలకి స్కూల్ ఫీజ్ లకు(టైమ్ అయిపోతోంది) 25,000.

ప్రసాద్ లేబ్ లో బాయ్ దుర్గారావుకి ‭హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ కోసం 25,000. ఆంధ్రజ్యోతి సబ్ఎడిటర్ రాజ్ కుమార్ గారి కొడుకు సోమేశ్వర్ కి ఒక ఊపిరితిత్తి పెరగటంలేదు. నిరంతరం ఆక్సిజన్ అందించాలట. వైద్యం కోసం 30,000. రచయిత ప్రాణమిత్ర బాబు లక్ష్మణ్ వేదవ్యాస్ బీటెక్ ఫీజ్ కొరకు 25,000 అందించారు.

ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘కాదంబరి కిరణ్ ‘మనం సైతం’తో మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. నటుడిగా కొనసాగుతూ ఆయన సేవా కార్యక్రమాల్లో భాగమవడం సంతోషంగా ఉంది. అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, చదువులు భారమైన పేదలకు మనం సైతం అండగా నిలబడుతోంది. ఈ సంస్థకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది.’ అన్నారు.

కాదంబరి కిరణ్ మాట్లాడుతూ ‘మా అమ్మ విజయనిర్మల, పెద్దలు సూపర్‌స్టార్ కృష్ణ గారు ‘మనం సైతం’ కుటుంబంలో భాగమై మా అందరికీ నీడగా మారినందుకు వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మనం సైతంకు పరిశ్రమ పెద్దలు, పాత్రికేయులు, రాజకీయ రంగ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు అండగా నిలబడుతుండటం మాకెంతో ధైర్యాన్నిస్తోంది. నన్ను నిత్యం వెన్నంటి ప్రోత్సహిస్తున్న మనం సైతం సహచరులకు కృతజ్ఞతలు’ అన్నారు.

సూపర్‌స్టార్ కృష్ణ గారి దారిలోనే నడుస్తున్నారు మహేష్ బాబు. నటుడిగానే కాకుండా మంచి మనసున్న మానవతా వాదిగా కూడా నిరూపించుకుంటున్నారు సూపర్‌స్టార్ మహేష్. బుర్రిపాలెం, సిద్ధాపురం అనే రెండు గ్రామాలను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలకు తన సంపాదనలో 30 శాతం విరాళంగా ప్రకటించి సమాజం పట్ల బాధ్యతను నెరవేరుస్తున్నారు మహేష్.

Share

Leave a Comment