తండ్రికి తగ్గ తనయుడు..

ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి, సినిమాలలోకి వచ్చాక కృష్ణ ఘట్టమేని గా మారారు. తేనె మనసులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృష్ణ ఎన్నో కష్టాలను ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయినా సహనం, ఓర్పుతో ఇండస్ట్రీలో ఎలాంటి వాళ్ళు ఎన్ని విధాలుగా వ్యాఖ్యలు చేసిన తన ఆత్మ విశ్వాసాన్ని నమ్ముకొని ముందుకు సాగారు.

చేసిన ప్రతీ సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. చెప్పాలంటే కృష్ణ చేసిన సాహసాలు ఇండస్ట్రీలో మరే హీరో చేయలేదని చెప్పాలి. గూడాఛారి 116 తర్వాత మళ్ళి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 350 సినిమాలలో నటించడం గొప్ప విషయం. అంతేకాదు మల్టీ స్టారర్ అంటే ముందుండే ఏకైక హీరో కృష్ణ.

ఇండస్ట్రీలో ప్రయోగాలను చేయాలన్నా కృష్ణ ముందుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో నాటి తరం హీరోల నుండి నేటి తరం హీరోల వరకు ఎంతో మంది టాలీవుడ్ లో ఉన్న వాళ్ళు కృష్ణ ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఒకేసారి మూడు సినిమాలని చేసిన ఘనత కృష్ణ కే దక్కింది.

ఒకరోజులు మూడు షిఫ్ట్ లు పనిచేశారు. ఉదయం 7 నుండి 12, 1 నుండి 5 ఆ తర్వాత 6 నుండి 10 గంటల వరకు ప్లాన్ చేసుకొని ప్రతీ రోజూ మూడు సినిమాలు చేశారు. అలా నాన్ స్టాప్ గా 10 సంవత్సరాలు దాదాపు 100 సినిమాలకి పైగా నటించారు.

బహుషా ఇలా చేసిన ఒకే ఒక్క హీరో కృష్ణ కావడం విశేషం. సినిమాలతో తీసుకున్న డేరింగ్ స్టెప్ ఆయనకి తిరుగులేని ఇమేజ్ ని క్రేజ్ ని సంపాదించి పెట్టింది. ఇక తన వారసత్వ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పల్సింది ఆ సూపర్ స్టార్ తనయుడు ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.

తండ్రి లోని ధైర్యాన్ని, మొండి తనాన్ని, పట్టుదలను ఏమాత్రం వదలకుడా తండ్రి మార్గంలోనే కొనసాగుతున్నాడు. ఆ జనరేషన్ లో కృష్ణ ఎంతటి క్రేజ్ ని సాధించారో అంతటి క్రేజ్ ని ఈ జనరేషన్ లో ఆయన కుమారుడు మహేష్ బాబు సాధించడం విశేషం.

తండ్రి మాదిరిగానే కథ ల ఎంపికలోను, నిర్మాతల హీరోగాను తండ్రినే అనుసరిస్తున్నాడు. తను ఎంపిక చేసే కధలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అంతే కాకుండా మల్టీస్టారర్, ప్రయోగాలు చేయడానికి ప్రస్తుత తరం నటులలో ఎప్పుడూ ముందుంటున్నాడు.

ఇక కృష్ణ కి మహేష్ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్క భావంతో చెప్పడం అది కేవలం మహేష్ కి మాత్రమే అర్థమవడం ఆసక్తికరమైన విషయం. మ‌న‌ల్ని బాధ్య‌త‌గా ముందుకు న‌డిపించే నాన్న ఎప్ప‌టికీ స్పెష‌లే. ఈ రోజు ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా మ‌హేష్ బాబు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.

త‌న తండ్రి కృష్ణ‌తో దిగిన ఫోటో షేర్ చేస్తూ దృఢ‌మైన‌, ద‌య‌, ప్రేమ‌, సున్నిత‌మైన‌,శ్ర‌ద్ధ ఇలాంటి కొన్ని ప‌దాల‌తో నా తండ్రితో నాకున్న రిలేష‌న్‌ని తెలియ‌జేస్తుంది. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కార‌ణం నాన్న‌. నాన్న‌లా నేను నా పిల్ల‌ల ద‌గ్గ‌ర ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాను.

హ్యాపీ ఫాద‌ర్స్ డే నాన్న అని మ‌హేష్ కామెంట్ రూపంలో రాశారు. మ‌రోవైపు సితార‌, గౌత‌మ్‌లు కూడా త‌న తండ్రికి విషెస్ అందించారు. మా నాన్న మాకు ఎప్పుడు స్పెష‌ల్. మేం ఏం చేసిన ఆయ‌న‌కి న‌చ్చుతుంది. లాక్‌డౌన్‌లో ఆయ‌న‌తో మేం స‌ర‌దాగా గ‌డిపాం అని చెప్పుకొచ్చారు

మహేష్ కి ఒక్క భారీ సక్సస్ వస్తే తండ్రీగా కృష్ణ ఎంతగా మురిసిపోతారో సరిలేరు నీకెవ్వరు సక్సస్ తర్వాత అందరూ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా బాప్ అంటున్నారంటూ చెప్పిన సందర్భమే చక్కటి ఉదాహరణ. ఇక ఆ సూపర్ స్టార్ ఈ సూపర్ స్టార్ నుండి ఎప్పుడు కోరుకునే గిఫ్ట్ ఒక భారీ హిట్ మాత్రమే. ఆ గిఫ్ట్ ని మరోసారి మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఇవ్వబోతున్నాడు.

Share

Leave a Comment