వీటిలో మహేష్ ని మించిన వారు లేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎంట్రీ ఈజీగా జరిగిపోయినా.. ఎదగడం అంత ఈజీగా ఏమీ రాలేదు. పడ్డాడు కానీ లేచాడు. ఒక్కో మెట్టూ ఎక్కాడు..ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. చివరికీ చెక్కుచెదరని సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పెద్ద హీరో అనిపించుకోవడం కన్నా మంచి నటుడు అనిపించుకోవడంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు మహేష్.

మహేష్‌ బాబు నటుడిగా ఎంతో పరిణితి చెందాడు, మొదటి నుండి మహేష్ ఎంపిక చేసుకునే సినిమాలు కుటుంబ ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే మహేష్ సినిమాల్లో కామెడీ తర్వాత ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి. మహేష్ సినిమాల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు ఒకసారి చూద్దాం.

మురారి: మహేష్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. నం ఏది బలంగా కోరుకుంటే అదే మన చెంతకి వస్తుంది.. ఇదే పాయింట్ మీద మురారి సినిమాని చిత్రీకరించారు..మహేష్ పెర్ఫామెన్స్ పీక్స్ అని ఒకటే ప్రశంసలు..కృష్ణగారబ్బాయిలా కాకుండా మహేష్ గా ప్రిన్స్ ను జనం గుర్తించేలా చేసింది మురారి.

నిజం: నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే సీతారాం అనే నిజాయితీపరుడైన యువకుడిగా అసమాన నటనను ప్రదర్శించారు మహేష్ బాబు. ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత
కూడా సేఫ్ గేమ్ ఆడకుండా మరోసారి తనలోని నటుడికి పని చేప్పే కొత తరహా సినిమా తో మన ముందుకి వచ్చాడు.

అర్జున్: బాధ్యత గల ఒక బ్రదర్ గా మహేష్ చేసిన పర్‌ఫార్మెన్స్ అందరిని కట్టిపడేసింది. అదిరిపోయే నటన తో మరో సారి ఫ్యామిలి ఆడియన్స్ అందరినీ తన వైపు తిప్పుకున్నాడు మహేష్. కంటెంట్ ని నమ్మి చేసే హీరో లో మహేష్ ని మించిన వారు లేరు అని మరోసారి చాటి చెప్పిన చిత్రం.

అతడు: మహేష్ తన నట విశ్వరూపం చూపించాడు. అరుపులు కేకలు లేకుండా హావ భావాలలో ఇంటెన్సిటీ పలికించి ఎంత గొప్ప నటుడో తెలియజేసాడు. క్లీన్ ఎంటర్‌టైన్మెంట్ అంటే ఇలా ఉండాలి అని అందరి మన్ననలను పొందిన చిత్రంగా నిలిచింది.

పోకిరి: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా? లేదా! బాక్సాఫీస్ దగ్గర అదే జరిగింది. మహేష్ కి కొత్త లుక్, కొత్త కేరెక్టరైజేషన్ తో సూపర్ స్టార్‌డమ్ తెచ్చి పెట్టింది.. ప్రిన్స్ మహేష్ బాబు కాస్తా సూపర్ స్టార్ మహేష్ బాబు గా మారిపోయారు.

అతిధి: మహేష్ బాబు ఎప్పటి లాగే అద్భుతంగా నటించాడు. సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్లలో మహేష్ నటించిన తీరు అందరి మన్నలను అందుకుంది. మహేష్ బాబు స్టైలిష్ నటన సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్స్ లో తను బెస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: మనకు డబ్బే జీవితం కాదు..అంతకుమించి బంధాలు, అనుబంధాలు, మన మంచి కోరుకునే నలుగురు మనుషులు ఉన్నప్పడే మనకు పూర్తి సంతృప్తి దొరుకుతుంది అని మనకి తెలిసేలా చేసిన చిత్రం. చిన్నోడి పాత్ర ని ఎవరైన న్యాయం చేయగలరు అంటే అది కేవలం మహేష్ అనేలా పోషించాడు.

1 నేనొక్కడినే: ఇటువంటి సినిమా ఇంతకు మునుపు రాలేదు ఇంక మళ్ళీ రాదు. టాలివుడ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిన సినిమా గా తెలుగు వారందరు గర్వ పడెలా సుకుమార్ చిత్రీకరించాదు, మహేష్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

శ్రీమంతుడు: ఊరిని దత్తత తీసుకోవాలనే ఉన్నతమైన ఆశయంతో చిత్రం తెరకెక్కి విశేష ప్రేక్షకాదరణ పొందింది. మహేష్ ఎప్పటిలాగే తన ఫెరఫార్మెన్స్ లోనూ,లుక్ లోనూ తనే సూపర్ అనిపించుకున్నారు. సామాజిక స్పృహ పెంచే కథ మహేష్ లాంటి స్టార్ హీరో చేయడం అందరినీ ఆలోచింపజేసింది.

భరత్ అనే నేను: మహేష్ బాబు కెరియర్లోనే భారీ వసూళ్ళను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. పొలిటికల్‌ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు రావడానికి టోటల్ గా మహేష్ ఒన్ మాన్ షో కారణం అనడం లో సందేహం లేదు.

పరిపూర్ణ నటుడికి సరైన ఉదాహరణగా మహేష్ ను చెప్పుకోవచ్చు ఎందుకంటే.. బాధతో ఏడిపించాలన్నా, నవ్వుతో కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించాలన్నా.. డైలాగులతో రక్తి కట్టించాలన్నా, సటిల్ యాక్టింగ్ తో మురిపించాలన్నా, ఫైట్లతో థ్రిల్ చేయాలన్నా మహేష్ కే సొంతం.

అందం, నటన.. ఇవి రెండూ చాలా అరుదుగా ఒక నటుడిలో చూస్తాం. మహేష్ కు ఈ రెండు సరిగ్గా సరిపోతాయి. ఎవరికైనా సంవత్సరాలు గడిచే కొద్దీ వయసు పెరుగుతుంది. కానీ మహేష్ కు మాత్రం తరుగుతున్నట్లుంది. లేదా 20 ఏళ్ళ వయసులోనే ఆగిపోయి ఉండాలి. ఇప్పటికీ మహేష్ చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు.

మహేష్ ప్రస్తుతం మహర్షి గా మనముందికి రాబోతున్నాడు. స్నేహం, కుటుంబ అనుబంధాల ఔన్నత్యాన్ని తెలియజెప్పే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌ బాబు కొత్త లుక్ లో కనపడనున్నాడు. రిషి కేరెక్టర్‌లో మహేష్ బాబు నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందనేది యూనిట్ సభ్యుల మాట.

ఈ చిత్రం ఫీల్ గుడ్ చిత్రంగా నిలిస్తుందని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గారు చెప్పిన విషయం విషయం తెలిసిందే. అంటే దీని బట్టి చూస్తే మరోసారి ఈ చిత్రం లో కూడా ఎమోషనల్ సీన్స్ కి పెద్ద పీట ఉండనుంది. మే 9న విడుదల కానున్నట్లు దిల్ రాజు ప్రెస్‌మీట్‌లో అధికారికంగా ప్రకటించారు.

Share

Leave a Comment