కొత్త లుక్‌లో అదరగొట్టేసాడు..

సౌత్ ఇండియాలో ఎంత మంది హీరోలున్నా కూడా సూపర్‌స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ వేరు. మహేష్ బాబు ఒక్కడు మాత్రం వెరీ స్పెషల్ అంతే. కమర్షియల్ యాడ్స్ చేయడంలో ఈ జెనరేషన్ లో ఈయన్ని మించిన హీరో లేడు అనడం లో అతిశయోక్తి లేదు

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ కూడా చేస్తూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. మహేష్ ఫాలోయింగ్ చూసి కార్పోరేట్ కంపెనీలు కూడా క్యూ కడుతున్నాయి.ఇప్పటికే ఎవరికీ సాధ్యపడనన్ని బ్రాండ్స్ కు ప్రచారకర్త గా ఉన్న మహేష్ ఇప్పుడు కొత్త బ్రాండ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు

ఇండియాలో ప్రముఖ ఆటో టెక్ కంపెనీ అయిన కార్‌దేఖోకు సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. మహేష్ బాబు ప్రచార కర్తగా కొత్త కమర్షియల్ యాడ్‌ను కార్‌దేఖో సంస్థ సోమవారం విడుదల చేసింది

కరో ఇండియా ఫార్వాడ్, కరో గాడి ఫార్వాడ్ నినాదంతో ఈ సరికొత్త టీవీ క్యాంపెయిన్‌ను కార్‌దేఖో రూపొందించింది. పైలట్ ఉద్యోగం చేస్తోన్న ఒక అన్నయ్య ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తన చెల్లెలు చిన్న పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పడానికి ఎలా సహాయం చేశాడు అనే విషయాన్ని టీవీసీలో హైలైట్ చేశారు

అన్నయ్య పాత్ర పోషించిన మహేష్ బాబు కార్‌దేఖో హోం ఇన్‌స్పెక్షన్ ద్వారా తన కారును అమ్మి ఆ డబ్బుతో తన చెల్లెలి చిన్నారి విద్యార్థులకు లాప్‌టాప్‌లు కొనిస్తాడు. ఈ యాడ్ లో మహేష్ కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది

కార్‌దేఖోతో అసోసియేషన్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో స్టార్టప్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కార్‌దేఖో గాడి తమ బిజినెస్, ఆఫర్స్‌తో ఇండియాను ముందుకు తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు

కార్‌దేఖోతో కలిసి పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ కలయిక విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అటు సినిమాలు ఇటు యాడ్స్‌తో నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్నాడు సూపర్ స్టార్

మొన్నటికి మొన్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం కూడా మహేష్ బాబు యాడ్ లో కనిపించాడు. అందులో సూపర్ స్టార్ డబుల్ రోల్ కూడా చేసాడు. ఇక ఐపిఎల్‌లో అన్నింటికంటే ఎక్కువగా మహేష్ థమ్స్ అప్ యాడ్ వస్తూనే ఉంది

ఇలా టీవీలో ఎక్కడ చూసినా మహేష్ ఒక్కడే కనిపిస్తున్నాడు. సినిమాల విషయంలో కూడా మహేష్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో మంచి విజయం అందుకున్న మహేష్ ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటతో బిజీ కానున్నాడు.

Share

Leave a Comment