సూపర్‌స్టార్ మహేష్ బాబు రన్నింగ్.. యాక్షన్స్ సీన్స్‌కు ఉండే క్రేజే వేరు. పోకిరిలో మహేష్ బాబు పరిగెత్తే సీన్స్‌కు థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. ఇక యాక్షన్స్ సీన్స్‌లో మహేష్ మ్యానరిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాల్లో ఇన్ని యాక్షన్ సీన్స్ చేసిన మహేష్.. ఒక వాణిజ్య ప్రకటన కోసం కూడా హాలీవుడ్ లెవల్లో యాక్షన్ సీన్స్ చేశారు.
మహేష్ బాబు అంటే కేవలం హీరో మాత్రమే కాదు.. బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఈయన సినిమాలతో పాటు యాడ్స్‌లోనూ రఫ్ఫాడిస్తుంటాడు. మరీ ముఖ్యంగా థమ్స్అప్ కు అయితే ఈయనే ఆస్థాన బ్రాండ్ అంబాసిడర్. ఇతర భాషల్లో ఎంత మంది హీరోలు మారినా దీనికి తెలుగు లో మాత్రం మహేష్ అలానే ఉన్నాడు.
తాజాగా థమ్స్ అప్ యాడ్‌లో మహేష్ చేసిన యాక్షన్ సీన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. మహేష్ సైతం ఈ యాడ్ గురించి సోషల్‌మీడియాలో చెపుతూ.. ఇలాంటి యాక్షన్ సీన్స్‌తో నేనెప్పుడు చేయని యాడ్..అంటూ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
ఇక యాడ్ విషయానికి వస్తే రిస్కీ అడ్వెంచర్ చేస్తున్న మహేష్ చుట్టూ బారు తుపాకులతో గూండాలు చుట్టుముట్టి ఉంటారు. ఈజీగా తప్పించుకోవడానికి అదేమి విశాలమైన రోడ్డు కాదు. కొండపై ఎత్తైన జలపాతాల మధ్యలో ప్రాణాలకు తెగించి మహేష్ వాళ్ళ మధ్య ఉన్నాడు.
తప్పించుకోవడం ఖాయమే కానీ అది ఎలా చేస్తాడు అనేదే అనేదే ఈ యాడ్. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో బైట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మహేష్ ఫేస్ తీవ్రమైన ఇంటెన్సిటీ తో అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉంది. హాలివుడ్ రేంజ్ లో ఉందని అందరూ ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రస్తుతం మహర్షి షూటింగ్ కి ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతుండటంతో రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసిన ఏప్రిల్ 5లో ఎలాంటి మార్పు ఉండదు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన విలేజ్ సెట్ లో చాలా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు.