ఎవరికీ అందనంత ఎత్తులో

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటుగా బ్రాండ్ ఎండార్స్ మెంట్ల విషయంలో కూడా జోరు చూపిస్తారనే విషయం తెలిసిందే. నేషనల్‌ వైడ్‌లో బడా బడా స్టార్స్‌, క్రికెటర్స్‌కి ధీటైన ఫాలోయింగ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉంది. మహేష్ బాబు ఇదొక పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది.

జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో టాప్‌లో ఉన్న కంపెనీలన్నీ రీజనల్‌ స్థాయికి వచ్చే సరికి సౌత్ మార్కెట్‌ కోసం సూపర్ స్టార్ మహేష్‌ వద్దకే వస్తున్నాయి. పలు అంతర్జాతీయ బ్రాండ్స్ మహేష్ తో తమ్ ప్రొడక్ట్స్ కు ఎండార్స్మెంట్ చేయించుకుంటాయి. వాణిజ్య ప్రకటనల విషయంలో టాలీవుడ్ హీరోలెవరికీ అందనంత ఎత్తులో మహేష్ ఉంటారు.

ఇప్పటికే పలు కార్పోరేట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబు రీసెంట్ గా మెన్స్ గ్రూమింగ్ ప్రాడక్ట్స్ బ్రాండ్ ‘డెన్వర్’ కు ప్రచారం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రీసెంట్ గా డెన్వర్ బ్రాండ్ డియోడరెంట్ అడ్వర్టైజ్మెంట్ షూట్ జరిగింది. మహేష్ తో పాటుగా ఈ యాడ్ లో ఒక మోడల్ కూడా నటించింది.

ఈ యాడ్ షూట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షూట్ లో మహేష్ బాబు వైట్ షర్ట్ .. బ్లాక్ ప్యాంట్ ధరించి మెడలో టైతో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఫోటోలలో మహేష్ స్టైలిష్ గానే కాకుండా చాలా యంగ్ ఆండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు.

మహేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బడా కంపెనీలు కోట్లాది రూపాయల ఆఫర్ తో మహేష్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆయన బ్రాండ్ వాల్యూ కి దరిదాపుల్లో కూడా మరే హీరో లేరంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకుంటున్న హీరోల జాబితాలోనూ టోటల్ సౌత్ ఇండియా లోనే మహేష్ నంబర్ వన్ గా నిలిచారు.

మహేష్ బాబు ఈ పేరు ముందు మహేష్ అభిమాన గ‌ణం ప్రిన్స్ అని, సూప‌ర్‌స్టార్ అని చేర్చి మ‌రీ పిలుచుకుంటారు. ప్రేక్షకులు తన మీద చూపించిన అభిమానానికీ, చూపిన ఆదరణకీ న్యాయం చేసి తిరిగి అంతకు మించి ఇవ్వడానికి తనలో ఒక కొత్త ఆలోచన నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఎదో ఒక కొత్తదనం తోనే మహేష్ సినిమాలు ఉంటాయి.

సినిమాల విషయానికి మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. ప్రతీదీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్న దర్శకుడు సూపర్ స్టార్‌ను ఓ రేంజ్‌లో చూపించాడని టాక్.

సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ హక్కులను జెమినీ టివి భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. గత కొన్ని సినిమాలలో మహేష్ బాబు నుంచి ఏమి మిస్ అవుతున్నారో అవి అన్నీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఉంటాయి. పక్కా సంక్రాంతి పండుగ సినిమా. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి అని నిర్మాత అనిల్ తెలిపారు.

ఎన్నో ప్రత్యేకలతో వస్తోన్న ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాయి. రష్మిక మందన్న హీరోయిన్ కాగా.. విజయశాంతి.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share

Leave a Comment