మహేష్ ఫ్యామిలీ @ డిస్నీల్యాండ్‌!

 

డిస్నీల్యాండ్‌ మాత్రమే కాదు… టుమారోల్యాండ్, హాలీవుడ్‌ స్టూడియో వంటివి ఎన్నో… పిల్లలు ఎంజాయ్‌ చేసే ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, మంచి మంచి ప్లేసులను హాలిడే ట్రిప్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ కవర్‌ చేస్తున్నారు.

అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు తిరుగుతున్నారట! స్పెషాలిటీ ఏంటంటే… కొన్ని ప్లేసులకు బై రోడ్‌ వెళ్లారట! మహేష్ ఫ్యామిలీతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ ఎర్నేని ఫ్యామిలీ ఈ ట్రిప్‌కి వెళ్లారని తెలుస్తోంది.

మహేష్ కుమారుడు గౌతమ్‌కృష్ణ, కుమార్తె సితారలు నవీన్‌ ఎర్నేని పిల్లలతో బాగా కలసిపోయారు. ఇక్కడున్న ఫొటోలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం మహేష్ అమెరికా వెళ్లారు. ఆయనతో పాటు నమ్రత, గౌతమ్, సితారలు కూడా వెళ్లారు.

నవీన్‌ ఎర్నేని ఫ్యామిలీ కూడా వెళ్లడం, అక్కడ రెండు కుటుంబాలూ ఎంజాయ్‌ చేయడం జరిగింది. మరో రెండు రోజుల్లో ఇండియా వచ్చేస్తారట!

వచ్చీ రాగానే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న షూటింగ్‌తో మహేష్ బిజీ అవుతారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల్లో మ‌ళ్లీ ఉత్త‌మ న‌టుడిగా నంది బ‌హుమ‌తి పొందాడు.

ఎవ‌రూ ద‌క్కించుకోన‌న్నీ నంది అవార్డుల‌ను ప్రిన్స్ మహేష్ బాబు ద‌క్కించుకుంటున్నాడు. ఈ జనరేషన్‌లో ఇప్పటి వరకూ 8 నంది అవార్డులను కైవసం చేసుకున్న ఒకే ఒక్క హీరోగా మహేష్ రికార్డ్ సాధించారు.

ఈ సారి ప్రత్యేకత ఏంటంటే.. మహేష్ తో పాటు ఆయన తనయుడు గౌతంకృష్ణ కూడా ఉత్తమ బాల నటుడిగా ‘1 నేనొక్కడినే’కు నంది అవార్డును అందుకోవడం. ఏ తండ్రికైనా ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది!

ప్రస్తుతం మహేష్ బాబు.. ఫ్యామిలీతో విదేశాల్లో వున్నారు.  అక్కడి నుంచి ఆయన ఈ నెల 20వ తేదీన తిరిగిరానున్నాడు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆయన కొరటాల శివ సినిమా షూటింగులో పాల్గొంటాడు.

హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో ఇటీవలే సీయం చాంబర్‌ సీన్స్‌ను కంప్లీట్‌ చేశారు. అమెరికా నుంచి మహేష్ రిటర్న్‌ అయిన వెంటనే నెక్ట్స్‌ షెడ్యూల్‌ పొల్లాచ్చిలో స్టార్ట్‌ కానుందట.

అక్కడ కొన్ని ఫైట్‌ సీన్స్‌ని తెరకెక్కిస్తారట. అన్నట్లు ఇంకోమాట.. ఈ సినిమాలో హోలీ ఫెస్టివల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సూపర్‌ ఫైట్‌ ఉంటుందట.

Share

Leave a Comment