ఆల్ ఇండియా రికార్డు ఔట్..

ఒకప్పుడు స్టార్ హీరోల ఖాతాల్లో సాధారణంగా సినిమా రికార్డులు ఉండేవి. సినిమా ఎన్నిరోజులు ఆడింది, ఎన్ని థియేటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుంది అనే లెక్కలపై రికార్డులు ఉండేవి. ఆ తరవాత సినిమా ఎంత వసూలు చేసింది అనే లెక్కలపై రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.

కానీ ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా మిగతా అన్నిటినీ మించి పైస్థాయి కి చేరుకుంది. అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్వీట్లతో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయంలో హీరోల అభిమానుల మధ్య ఇప్పుడు విపరీతమైన పోటీ పెరిగింది.

ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చరిత్ర తిరగరాశారు. సోషల్ మీడియా లో సునామీ సృష్టించారు. ట్విట్టర్‌లో బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను సొంతం చేసుకుని సరికొత్త బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ ట్రెండ్స్ కి సెట్ చేసి సత్తా చాటుకున్నారు.

జెట్ స్పీడ్ తో దూసుకు పోతూ పాత రికార్డులు ఒక్కోటి బ్రేక్ చేస్తూ దూసుకు పోయారు. 3 కోట్లకు పైగా ట్వీట్లతో ఇండియా ట్విట్టర్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు లేని బిగ్గెస్ట్ ట్రెండ్‌ను మహేష్ బాబు అభిమానులు సృష్టించారు. ఈ ట్రెండ్ కేవలం మహేష్ బాబు బర్త్‌డే కామన్ డిస్ప్లే పిక్ కోసమే.

ఇక మహేష్ బాబు బర్త్‌డే (ఆగస్టు 9న) రోజున ఈ ట్వీట్ల రికార్డు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో 31 మిలియన్ ట్వీట్లు చేశారు మహేష్ బాబు అభిమానులు. ఇండియన్ ట్విట్టర్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారు.

ఈ నెలలో పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో పుట్టినరోజుకు 50 రోజుల ముందే #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో బర్త్‌డే ట్రెండ్ మొదలుపెట్టారు. 27 మిలియన్‌కు పైగా ట్వీట్స్‌ చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్ బర్త్‌డే రోజున #HappyBirthdayNTR తో 21.5 మిలియన్ ట్వీట్లు చేశారు ఫ్యాన్స్.

వీటినన్నింటిని నిన్న మహేష్ అభిమానులు దాటేశారు. అది కూడా మునుపెన్నడూ లేని విధంగా, భారత దేశం లో అత్యధికంగా 31.7 మిలియన్ మార్కు ను అందుకుని ఆల్ టైం రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఇండియా మొత్తంలో ఇంత భారీ స్థాయి ట్రెండ్ నమోదు అవ్వలేదు.

ముందుగా అసలు సిసలు అడ్వాన్స్ బర్త్ డే CDP ట్రెండ్ విషయం లో పాత రికార్డులను కేవలం 3 గంటల 37 నిమిషాల్లోనే బ్రేక్ చేసిన మహేష్ ఫ్యాన్స్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి CDP ట్రెండ్స్ లో ఎవ్వరూ అందుకోలేని బెంచ్ మార్క్ ని ప్రస్తుతం సెట్ చేసి పెట్టారు.

ఇక తర్వాత 24 గంటలు పూర్తీ అయ్యే సరికి 31 మిలియన్ ట్వీట్స్ తో సరికొత్త సంచలన బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ బిగ్ ట్రెండ్స్ సెట్ చేసి పెట్టారు. ఈ క్రమం లో అనేక రికార్డులను సృష్టించిన మహేష్ ఫ్యాన్స్ టైటిల్ టాగ్ పై కూడా ఇది వరకు ఉన్న రికార్డ్ ను భారీ లీడ్ తో బ్రేక్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అనే చెప్పాలి.

Share

Leave a Comment