ఇంతకంటే ఏం చేయగలను?

మ‌హ‌ర్షి సినిమా పోకిరి స్క్వేర్ అవుతుంద‌ని ముందే ఊహించాను అని అన్నారు మ‌హేష్‌ బాబు. మహర్షి విజ‌య‌యోత్స‌వం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. మహేష్‌బాబు, అల్లరి నరేష్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి ఈవెంట్‌లో పాల్గొన్నారు.

డెహ్ర‌డూన్‌లో తొలి రోజు షూటింగ్ పూర్తి కాగానే టీమ్‌కి చెప్పా. “పోకిరి సినిమా తర్వాత ఇది దానిని మించి రెండింతలు అవుతుంద‌ని చెప్పాను. ఎందుకంటే స్టూడెంట్ రోల్ పోషిస్తున్నపుడే అర్థ‌మైంది. ఈ సినిమాలో నేను స్టూడెంట్‌గా క‌నిపించ‌డ‌మే ఎక్కువ కిక్ ఇచ్చింద‌ని” మ‌హేష్ ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక వేదిక‌ పై చెప్పారు.

మ‌హేష్‌ మాట్లాడుతూ – ‘‘మహర్షి’లో చేసిన రిషి నాకు బాగా నచ్చిన క్యారెక్టర్‌. విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని, ఇక్కడ ఫంక్షన్‌ చేస్తే ఆ ఫీలే వేరు. నేను ముందుగా అనుకోకపోయినా నా సినిమా హిట్‌ అయినప్పుడల్లా అమ్మ నన్ను పిలుస్తోంది ఇక్కడికి. రాఘవేంద్రరావు మామయ్యగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

‘రాజకుమారుడు’ సినిమా సమయంలో అన్నీ తానే అయి, ఓ స్నేహితుడిలా నాకు నటన నేర్పినందుకు రుణపడి ఉంటాను. ముగ్గురు గొప్ప నిర్మాతలు నా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అశ్వినీదత్‌ గారు నా మొదటి సినిమా, 25వ సినిమా చేయటం చాలా సంతోషం. సినిమాలో పనిచేసిన నరేష్, పూజా, అందరికీ కృతజ్ఞతలు.

సినిమాలో మంచి క్యారెక్టర్‌ చేసిన గురుమూర్తి (వృద్ధ రైతు పాత్ర చేసిన వ్యక్తి) గారి ఆశీస్సులు, దీవెనల వల్లే సినిమాకు ఇంత హిట్‌ లభించింది. నాన్న గారి అభిమానుల గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మీకు నచ్చితే ఎంతలా ఆదరిస్తారో నాకు బాగా తెలుసు. మీకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను.

నా బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్స్ ని ఫస్ట్ వీక్ లోనే దాటించేసి ‘మహర్షి’ కి ఘన విజయాన్ని అందించిన మీ అభిమానానికి సలాం..వారం రోజుల్లోనే ఇంత పెద్ద హిట్‌ చేసినందుకు ధన్యవాదాలు.
..మీరిచ్చిన ఈ విజయానికి నా దగ్గర మాటల్లేవ్.. మీకు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయగలను?

ఆంధ్రా హాస్పిటల్‌ రామారావుగారు ఇంతకు ముందు చెప్పారు.. పిల్లలు సర్జరీ సమయంలో నా పేరు వినగానే సంతోషంగా ఫీల్‌ అవుతున్నారని. నా జీవితంలో ఇదే గొప్ప కాంప్లిమెంట్‌. పిల్లల జీవితాలను కాపాడటం చాలా గొప్ప విషయం. చాలా గొప్పగా చెబుతున్నా.. మీలాంటి వారితో పని చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా’’ అన్నారు.

‘‘దేశంలో మనమందరం చల్లగా ఉన్నామంటే కారణం ఇద్దరే. ఒకరు జవాన్, మరొకరు రైతు. అటువంటి రైతుల గురించి సినిమా తీసినందుకు చాలా సంతోషం. ఈ సినిమాను రైతులకు అంకితం చేస్తున్నాను. సినిమా కోసం మూడేళ్ల పాటు మహేశ్‌తో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం.

‘అల్లరి’ నరేశ్‌ చేసిన రవి పాత్ర ఈ సినిమాకు చాలా ముఖ్యమైనది. ఇటువంటి సినిమా చేసే అవకాశం కలిగించిన దిగ్గజ నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా హిట్‌ కావడానికి సహకరించిన నా టీమ్‌కు రుణపడి ఉంటాను. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ సినిమా హిట్‌కి కీలక పాత్ర అయింది’’ అన్నారు వంశీ పైడిపల్లి.

‘‘ఇద్దరు విజయవాడ టైగర్స్‌తో కలసి సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. మే 1న (ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో) కాస్త ఎక్కువగా మాట్లాడాను అనుకున్నవారికి సినిమా హిట్‌తో నేను మాట్లాడింది నిజమని అర్థమై ఉంటుంది. మహేశ్‌ నాకు మరో సినిమాకి డేట్స్‌ ఇస్తే అదే నాకు పెద్ద గిఫ్ట్‌’’ అన్నారు ‘దిల్‌’ రాజు.

‘‘మ‌హేష్‌ బాబుతో నేను చేసిన ‘రాజకుమారుడు’ ఇక్కడ అలంకార్‌ థియేటర్‌లో 100 రోజులు, 4 ఆటలతో ఆడి రికార్డ్‌ సృష్టించింది. ఇప్పుడు ‘మహర్షి’ వాటిని మించి బాగా అడుతోంది. అమెరికాలో కొత్త రికార్డ్‌ నెలకొల్పుతోంది. వంశీ, సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు అశ్వినీదత్‌.

‘సినిమాను హిట్‌ చేసిన కనకదుర్గమ్మకు, మహేశ్‌బాబుకు కృతజ్ఞతలు. సినిమా రిలీజ్‌ కాకుండానే హిట్‌ అవుతుందని సక్సెస్‌ మీట్‌ డేట్‌ను ప్రకటించాను. ఇక మీదట బాబును ‘మహర్షి’ మహేశ్‌ అని పిలవాలి. సూపర్‌ స్టార్‌ అన్నది బిరుదు. మహర్షి అన్నది బాధ్యత. వంశీ తన టీమ్‌తో కష్టపడి గొప్ప విజయాన్ని అందించారు’’ అన్నారు పీవీపీ.

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. తొలి వార‌మే రికార్డు కలెక్షన్స్ కొల్ల‌గొట్టింది. రెండోవారంలో కూడా అదే రేంజిలో ఆకట్టుకుంటుంది అని ఇండస్ట్రీ వర్గాల మాట.

ఈ వేడుకలో దర్శకులు వైవీఎస్‌ చౌదరి, అనిల్‌ రావిపూడి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నటులు పృథ్వీరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, వైఎస్సార్‌సీపీ నేత భవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సినిమా రెండో వారంలో అడుగుపెట్టినా కూడా ఇంకా అదే రెస్పాన్స్ తో హౌస్‌ఫుల్స్ తో ప్రదర్శింపబడుతుంది.

మ‌హేష్‌ బాబు మాత్రం ఎంతో డెడికేషన్ తో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇంకా పాల్గొంటున్నాడు. ఇప్పటికే అన్ని రికార్డులని తిరగరాస్తున్నా కూడా ఈ చిత్రం తనకి గొప్ప రెస్పెక్ట్ తెచ్చి పెట్టింది అని ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలలో తెలిపాడు.. ఇటువంటి గొప్ప సినిమాలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ప్రజల్లోకి ఈ సినిమా మరింత వెల్లడానికి చిత్ర యూనిట్ కృషి చేస్తున్నారు.

Share

Leave a Comment