మహేష్ క్రేజ్ కు ఇదే నిదర్శనం!

హిట్లకు ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమా సినిమా కి క్రేజ్ ని పెంచుకునే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ ఒకరు.

మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది. కానీ పరాజయాలు కూడా మహేష్‌ స్థాయిని పెంచుతుంటాయి.

మహేష్‌ తన సినీ ప్రయాణాన్ని తలచుకొని తానే ఆశ్చర్యపోతుంటారు. పరాజయం ఎదురైన ప్రతిసారీ ఆయన సినిమాల స్థాయి, మార్కెట్టు అమాంతం పెరిగిపోతుంటుంది.

ఇప్పుడే కాదు… మొదట్నుంచీ కూడా మహేష్‌ జయాపజయాలతో సంబంధం లేకుండా సత్తా చాటుతుంటారు.

ప్రస్తుతం క్రేజ్ విషయం లో మహేష్ రేంజ్ వేరుగా ఉందని చెప్పాలి. ఒక్క హిట్ పడితే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సత్తా సూపర్ స్టార్ మహేష్ సొంతం అని చెప్పొచ్చు.

ఇప్పుడు ఇదే విషయాన్నీ నేషనల్ ట్రేడ్ అనలిస్టులు కూడా చెబుతున్నారు.

రీసెంట్ గా కోలివుడ్ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్ళై మరియు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ తో జరిపిన ఇంటర్వ్యూలో అనుకోకుండా మహేష్ క్రేజ్ గురించిన చర్చ జరగగా తరన్ ఆదర్శ్ ఏమాత్రం తడుముకోకుండా బాలీవుడ్ హీరోలకు మహేష్ ఉన్న క్రేజ్ లేదనే చెప్పాడు. తరన్ ఆదర్శ్ మట్లాడుతూ :

స్టార్‌ వ్యాల్యూ…ఇండస్ట్రీలో వినిపించే మాట. ఓ అగ్ర నటుడు తన అభినయంతో కథను మరో స్థాయికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ ప్రధమ స్థానం లో ఉంటారు. వ్యాపారంలో అతని క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

స్పైడర్ లాంటి సినిమాతో ఓవర్సీస్ లో 1 మిలియన్ ప్రీమియర్ షో కలెక్షన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదని అద్భుతం అని చెప్పారు. బాలీవుడ్ టాప్ హీరోలు… అమీర్, సల్మాన్ మరియు షారుఖ్ లకు అది లైఫ్ టైం విషయంలోను కొన్ని సార్లే సాధ్యం అయ్యిందని చెప్పారు.

మహేష్ ఈ స్టార్స్ తో పోల్చితే వేరే లీగ్ లో ఉన్నాడని చెబుతూ సూపర్ స్టార్ ని ఆకాశానికి ఎత్తేశాడు.

అందుకే ఎప్పట్లాగే సెట్స్‌పై ఉన్న మహేష్‌ కొత్త సినిమా ‘భరత్‌ అనే నేను’ గురించి అటు ప్రేక్షకులు, ఇటు పరిశ్రమ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.

‘భరత్‌ అనే నేను’ సినిమా రూపకల్పన పూర్తి కాకముందే అన్ని ప్రాంతాల్లో భారీ ధరలకు అమ్ముడవుతోంది.

విజయవంతమైన ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ – కొరటాల కలయికలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్‌ కూడా ఈసారి అభిమానుల కళ్లల్లో ఆనందం చూడాలని ఫిక్సయ్యారు. మండుటెండల్లో వినోదాలు పంచడమే లక్ష్యం చేసు కొన్నారు.

ఏప్రిల్‌ 27న ‘భరత్‌ అనే నేను’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో మహేష్‌ కనిపించే విధానం, కథ, సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది.

Share

Leave a Comment