అపురూప కలయికతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు

శనివారం సాయంత్రం ఒకే స్టేజ్ మీద ఇద్దరు స్టార్ హీరోలు. అలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవని అభిమానుల ఆనందకేళి. భరత్ అనే నేను బహిరంగ సభలో మహేష్ బాబు , కొరటాల శివ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.

ఘట్టమనేని, నందమూరి అభిమానులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. అలా ఇద్దరు స్టార్ హీరోలను స్టేజ్ మీద చూస్తుంటే కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు చూసే ప్రతి ఒక్కరికి కన్నుల పండుగగానే ఉంటుంది.

భరత్ అనే నేను టీం కోసం బహిరంగ సభ పూర్తి కాగానే పార్టీ ప్లాన్ చెయ్యగా.. అక్కడికి రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిసి ఎంజాయ్ చేశారు. ఇక ఎన్టీఆర్ స్టేజ్ మీద మహేష్ బాబుకి విషెస్ తెలుపగా.. రామ్ చరణ్ పార్టీలో మహేష్ కి భరత్ అనే నేను హిట్ కావాలని విషెస్ తెలియజేశాడు.

రామ్ చరణ్, మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి అలా ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే అబ్బబ్బ ఏం ఉందిరా అనిపిస్తుంది. మరి ముగ్గురు స్టార్ హీరోలు స్టేజ్ మీద కనబడకపోతేనేమి…ఇలా పార్టీలో కనబడినా చాలు, ముగ్గురు హీరోల ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది.

రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నమ్రత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. మహేష్ బాబు ఇంట్లో జరిగిన పార్టీలో మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అంతా ఒక వైపు…నమ్రత, ఉపాసన అంతా మరో వైపు పార్టీని ఎంజాయ్ చేశారు.

ఈ పార్టీలో భరత్ హీరోయిన్ కైరా అద్వానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కూతురు సితారతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

భరత్ అనే నేను బహిరంగ సభలో మహేష్ బాబు అందరి అభిమానులను ఉద్దేశించి… మేమంతా ఒకటే.. అలాగే మీరు కూడా బాగుండాలి కాదు ఇంకా బాగుండాలి అని కలిసుండాలని పిలుపు ఇచ్చారు.

చాలా కాలం తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలంతా కలిసి ఒకే ఫ్రేములో కనిపించడం, అంతా కలిసి వేడుక చేసుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

Share

Leave a Comment