ఖలేజా డిలీటెడ్ సీన్స్ !!

తెలుగు చలనచిత్ర రంగంలో కొన్ని చిత్రాలు చిరస్తాయిలో నిలిచిపోతాయి. అవి ఒక బెంచ్‌మార్కుని సెట్ చేసి రాబోయే తరానికి పాఠ్య పుస్తకాలుగా నిలిచిపోతాయి. అటువంటి ఎవర్ గ్రీన్ సినిమాలు ను మనకు అందించిన కాంబినేషన్ మహేష్ బాబు, త్రివిక్రమ్.

అతిథి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. అతడు కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు. కానీ, అది కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. దీంతో ప్రిన్స్ అభిమానుల్లో మరింత నిరీక్షణ పెరిగిపోయింది.

అప్పటి వరకు చూడని ఒక కొత్త మహేష్ ని చూసారు ప్రేక్షకులు. త్రివిక్రమ్ డైలాగ్స్ ను మహేష్ బాబు చెప్పినంతగా మరొకరు చెప్పలేరు అనే స్థాయిలో ప్రతి సన్నివేశంలో అద్భుతమైన కామెడీని పండించారు. ఒక రకంగా మహేష్ లో ఇంత కామెడీ యాంగిల్ ఉంటుందని కూడా ఎవరికీ తెలియలేదు.

ఖలేజా సినిమా మొత్తం మహేష్ మాట్లాడుతూ పంచ్ లు వేస్తూనే ఉంటాడు. ఆ డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఖలేజా నుంచి కొన్ని ఎడిటింగ్ లో తీసేసిన సీన్లు కూడా ఉన్నాయి. అవి కూడా కామెడీ సిన్లే. అవి ఏంటో మీరు కూడా చదవండి.

ఈ సన్నివేశాలన్నీ మహేష్ బాబు రావు రమేష్ గ్రామానికి వెళ్ళిన తరువాత జరిగేవి. అన్నీ కూడా మహేష్ బాబు, ఎం.ఎస్ నారాయణ గారి మధ్య జరిగే సన్నివేశాలే. సినిమా నిడివి పెరుగుతుందని వీటిని ఫైనల్ కాపీ నుంచి తొలగించారు. అందులో మొదటి సన్నివేశం ఇలా కొనసాగుతుంది.

మహేష్ ఇలా అంటాడు నువ్వొక్కడివే ఈ ఊరిలో కరెక్ట్‌గా మాట్లాడుతున్నావ్ భయ్యా. దానికి ఎం.ఎస్. ఎందుకంటే ఈ ఊరిలో నేనొక్కడినే ఎడ్యూకేటెడ్ ని. మహేష్ ఏం చదువుకున్నావ్. ఎం.ఎస్ 3వ క్లాసు. మహేష్ పాస్ ఆ ఫెయిల్ ఆ. ఎం.ఎస్. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లెంస్ వల్ల పరీక్షలు రాయలేకపోయా.

ఇంకో సన్నివేశం లో మహేష్ బాబు, ఎం.ఎస్ నారాయణ మధ్య ఇలా సంభాషణ కొనసాగుతుంది. ఎం.ఎస్. ఐనా నువ్వేంటయ్యా పువ్వులు రాలాలి, నీళ్ళు రావాలి అని కోరుకుంతావ్? మహేష్ ఆ, మరి. ఎం.ఎస్. అదేదో ఆ బోర్ నుండి బీర్ రావాలనో, ఆ బావి నుండి బ్రాందీ రావాలనో కోరుకోవచ్చుగా?

మహేష్ నువ్వు కూడా ఏంటయ్యా? నేను ఇక్కడికి అమ్మాయిలు రావాలని అంటాను వచ్చేస్తారా ఏంటి?. వెంటనే అక్కడకు ఒక మెడికల్ అంబులెన్స్ వ్యాన్ వస్తుంది. అందులోంచి వరుసగా నర్స్ లు దిగుతారు. దీంత్ ఎం.ఎస్. గారు షాక్ అవుతారు. ఇదీ సన్నివేశం.

ఇక మిగిలిన ఆఖరి సన్నివేశం ఇందాకటి వాటితో పోలిస్తే చిన్న సన్నివేశం. ఎం.ఎస్. ఒక ఇంటిని చూపించి అది నా ఇల్లు. మహేష్ నాకెందుకు చూపిస్తున్నావ్? ఎం.ఎస్. వీళ్ళు మూర్ఖులు. నువ్వెప్పుడన్నా ఆ ఇల్లు కూలిపోవాలి అని కోరుకుంటే వాళ్ళు వెళ్ళి పడగొట్టేస్తారు.

కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో ఒక సూపర్ స్టార్ మూడేళ్ళ పాటు విరామం తీసుకుని, సిల్వర్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వడానికి సిద్ధం కావడంతో ఎక్కడలేని భారీ అంచనాలన్నీ ఖలేజా పై నెలకొన్నాయి.టీజర్ ఆండ్ ప్రోమో సాంగ్స్ కి జనాలలో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఆతురత పెరిగింది.

దీనికి తోడు రోమాలు నిక్కపోడుచుకునేలా సాగిన సదా శివ ప్రమోషన్ వీడియో సాంగ్ చూసి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రతి సన్నివేశాన్ని చూసి హాయిగా నవ్వుకుని, ధియేటర్ నుండి బయటకు వచ్చేవారు ప్రేక్షకులు. ఇంకా అంతే కొత్తగా అనిపిస్తుంది ఈ చిత్రం.

అలాగే మహేష్ లోని సరికొత్త నటనను వెలికి తీయడంలో త్రివిక్రమ్ నూటికి 200 శాతం సక్సెస్ అయ్యారు. ఈ ప్రభావం బుల్లితెర మీద బాగా కనపడుతోంది. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్ళు గడిచినా ఇప్పటికీ బుల్లితెర మీద ప్రదర్శిస్తే వేచిచూసే అభిమానులకు కొదవలేదు.

నటుడుగా సూపర్‌స్టార్ మహేష్ కెరీర్ ను మలుపు తిప్పింది మాత్రం మహేష్ ఖలేజా చిత్రమే. అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించలేరు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అని త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుంది.

Share

Leave a Comment