అదిరేటి కొత్త లుక్ లో..

మహేష్‌ బాబు దాదాపు ఎనిమిది నెలల తర్వాత హాలీడేస్‌కి బయటకు వెళ్లారు. ఇక ఎయిర్‌పోర్ట్ లో బయలు దేరినప్పటి నుంచి ప్రతి రోజు తన టూర్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నారు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్‌, ముద్దుల తనయ సితారతో కలిసి మహేష్‌ వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు

తాజాగా మహేష్‌ మరింత కొత్తగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. మార్నింగ్‌ మూడు గంటలకు విమానం కోసం వెయిట్‌ చేస్తున్నబ్రహ్మాండమైన వ్యక్తి అని తెలిపింది నమ్రత. ఈ సమయంతో ఎవరైనా ఇలా కనిపిస్తారా? అన్నట్టుగా పేర్కొంది

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ ఫొటోకు అభిమానులు హాలీవుడ్ హీరో లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ గా కనిపించే కంటే మహేష్ బాబు ఈ మద్య భిన్నంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ మారింది

మునుపటి కంటే మరింత యంగ గా సూపర్‌స్టార్ కనిపిస్తున్నారు. ఇక ఈ ఫొటోలో అత్యంత స్టైలిష్ గా గాగుల్స్ ధరించి రాయల్ లుక్ లో కనిపించిన సూపర్ స్టార్ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వేలకు పైగా షేర్స్ లక్షల్లో లైక్స్ వచ్చాయి

అయితే మరి ఏ ఎయిర్‌పోర్ట్ అనేది క్లారిటీ లేదు. మరి అప్పుడే హాలీడేస్‌ని ముగించుకుని వస్తున్నాడా? లేక మరో ప్రాంతానికి వెళ్తున్నారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా ఈ న్యూలుక్ లో మహేష్ అచ్చు హాలీవుడ్ హీరో లా ఉన్నాడనే చెప్పాలి

ప్రతి సినిమా షూటింగ్ కి ముందు విడుదల తరువాత ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లడం, మహేష్ కి ఆనవాయితీగా ఉంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తన తదుపరి చిత్రాన్ని కూడా త్వరలో సెట్స్ మీదకి తీసుకువెళ్ళనున్నాడు

ఇదిలా ఉంటే మహేష్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటించనున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించనుంది. దీనికి యువ సంచలనం థమన్‌ సంగీతం అందిస్తున్నారు

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా లేకపోతే ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ సగం కంప్లీట్ కూడా అయిపోయేది. ఇక అతి త్వరలో సర్కారు వారి పాట తొలి షెడ్యూల్ మొదలవనుందని తాజా సమాచారం

పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

Share

Leave a Comment