పేరు లోనే నాలుగు సినిమాలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ఎప్పటికప్పుడు తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ సారి మాత్రం సర్కారు వారి పాట విషయానికి వస్తే ప్రీ లుక్ తోనే సరికొత్త మేక్ ఓవర్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసి ఇప్పటి నుండే అంచనాలు పెరిగేలా చూసుకున్నాడు మహేష్ బాబు.

ఇక ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా టైటిల్ కన్ఫాం అవ్వడం తో మహేష్ ను ఫ్యాన్స్ పిలిచే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు లోనే టోటల్ గా 4 టైటిల్స్ రావడం జరిగింది, అది కూడా గత మూడు సినిమాలు ఇప్పుడు నాలుగో సినిమా గా సర్కారు వారి పాట ఎంటర్ అయ్యింది.

అదెలా అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు వర్డ్స్ లోని మొదటి లెటర్ తో తన లేటెస్ట్ సినిమాల పేర్లు అన్ని రావడం విశేషం అని చెప్పొచ్చు. SSMB అంటూ ఫ్యాన్స్ పిల్చుకునే మహేష్ పేరులో S – #SarkaruVaariPaata , S – #SarileruNeekevvaru , M – #Maharshi , B – #BharatAneNenu

ఇలా లాస్ట్ మూడు సినిమాలతో పాటు ఇప్పుడు చేస్తున్న సర్కారు వారి పాట కూడా వచ్చి చేరింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పేరు లో వచ్చిన సినిమాలు మూడు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ గా నిలవగా ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో విజయం అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

ఓవరాల్ గా ఈ సెంటిమెంట్ హీరోల పేర్ల మీద ఇది వరకు కూడా ఒకరిద్దరి హీరోల విషయం లో జరగగా ఇప్పుడు మహేష్ కి కూడా జరిగింది, మరి ఈ సెంటిమెంట్ ప్రకారం సినిమా కూడా ఎంత బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందా అని తెలియాలి అంటే మనం ఎదురు చూడాల్సిందే.

ఈ పోస్టర్ లో మహేష్ పూర్తి లుక్ మాత్రం రివీల్ చేయలేదు. ఒక సైడ్ లో మాత్రమే పోస్టర్ లో మహేష్ ని చూపించారు. మహేష్ చెవి పొగుతో అలాగే మెడపై రూపాయి టాటూ వేసుకోవడం స్టైలిష్ గా ఉంది. రఫ్ గా కనిపించేలా గడ్డం, బ్లాక్ షర్ట్, ఫ్రీ హెయిర్ స్టైల్ తో మాసీగానే కనిపిస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఈ ప్రీ లుక్ టైటిల్ అనౌన్స్ మెంట్ ఇలా జరిగిందో లేదో సాలిడ్ గా ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది, టైటిల్ రిలీజ్ చేసిన 3 నిమిషాలలోనే ఇండియా లో టాప్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టి సంచలనం సృష్టించగా వరల్డ్ వైడ్ గా 6 నిమిషాల్లో లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది.

టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనే అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్ లో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి రాబోయే టైటిల్ ట్రెండ్స్ కి సరికొత్త టార్గెట్ ని సెట్ చేశారు, ఈ క్రమం లో ట్విట్టర్ లో మోస్ట్ రీట్వీటెడ్ అండ్ మోస్ట్ లైకుడ్ ఫస్ట్ లుక్ ఇన్ 24 హవర్స్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఇక పరశురాం తొలిసారి సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తుండగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు కూడా సినిమా లో ఉండేలా చూసుకుంటానని ఇది వరకే చెప్పడం తో సినిమా ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎదురు చూపులు మొదలు పెట్టారు.

మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయని పరశురామ్ చెప్పారు.

Share

Leave a Comment