మాటలు కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నాడు..

కొందరుంటారు.. మాటలు చెప్పమంటే కోటలు దాటుతాయి. సమస్య పరిష్కారం సంగతి పక్కనపెడితే.. మైకుల ముందు మాత్రం గంటలు గంటలు ఆదర్శాల గురించి స్పీచులు దంచుతారు.

వీళ్ల వల్ల పెద్దగా ఉపయోగమేమి లేదు. కానీ ఇంకొందరు ఉంటారు.. చాలా తక్కువ మాట్లాడుతారు, సందర్భం వచ్చినప్పుడు చేతల్లోనే తమ సత్తా ఏంటో చూపిస్తారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కోవకే చెందుతారు. రీల్ లోనే కాదు.. రియల్ గా కూడా అసలుసిసలు శ్రీమంతుడు మహేష్ బాబు అనిపించేలా వ్యవహరిస్తున్నాడు.

మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్‌లో ఒక గ్రామాన్ని, తెలంగాణలో మరో గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

కేవలం ఆదర్శాల కోసమే ఈ ప్రకటనలు చేసి ఊరుకోలేదు మహేష్. ఈ రెండు గ్రామాల అభివృద్ది పట్ల చిత్తశుద్దితో, నిజాయితీతో వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరైన బుర్రెపాలెంను దత్తత తీసుకున్న మహేష్ బాబు.. ఇప్పటికే ఆ గ్రామాన్ని చాలావరకు అభివృద్ది చేశారు.

ఇక రెండో దత్తత గ్రామమైన మహబూబ్ నగర్ లోని సిద్ధాపురం గ్రామ అభివృద్దిపై మహేష్ ప్రస్తుతం ఫోకస్ చేశారు.

కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామ అభివృద్ది పనులను మహేష్ బాబు భార్య నమత్రా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అభివృద్ది పనుల్లో భాగంగా ప్రస్తుతం సిద్దాపురంలో స్కూల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. గ్రామ అవసరాల మేరకు ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు.

స్కూల్ భవనం పూర్తయ్యాక మరో భారీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. స్కూల్ భవన నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈరోజుల్లో చిన్న చిన్న పనులకే భారీ పబ్లిసిటీ కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటిది మహేష్ బాబు ఓ ఊరి కోసం ఇంతలా చేస్తున్నా..పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు.

దీంతో మహేష్ నిజాయితీని చాలామంది అభినందిస్తున్నారు. చాలా మంది చెబుతారు. కానీ చెప్పింది చేసే వారు తక్కువే. తాను రెండో కోవలో ఉంటానని తన చేతలతోనే చేసి చూపించాడు ప్రిన్స్ మహేష్.

2018 లో కొరటాల మూవీని, వంశీ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంటే మహేష్ అభిమానులకు మహేష్ డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నాడన్నమాట.

Share

Leave a Comment