మరో రికార్డు కొట్టారు..

ఈ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవక్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర బొమ్మ దద్దరిల్లేలా చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

అంతేకాదు ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ లుక్స్, కామెడీ టైమింగ్, డ్యాన్సులు ఇలా ప్రతీ ఒక్కటి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చాయి. బిగ్ స్క్రీన్ పై సత్తా చాటిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై కూడా ఇరగదీసింది.

ఆ మధ్య జెమినీ టీవీలో మొదటిసారి ప్రసారమైన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అత్యధిక 23.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇదే అత్యధిక టీవీఆర్. ఆల్ టైం టాప్ లో నిలిచి రికార్డ్ సృష్టించింది. ఏ సినిమాకు కూడా గత 15 ఏళ్లలో ఇంత టీఆర్పీ రేటింగ్స్ రాలేదంటే అతిశయోక్తి కాదు.

ఈ దెబ్బకు బాహుబలి లాంటి చిత్రాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. తాజాగా స్మాల్ స్క్రీన్ పై రెండోసారి ప్రసారమైన సరిలేరు నీకెవ్వరు సినిమా 17.4 టీర్పీ సాధించడం విశేషం. మొత్తంగా వెండితెరపై సూపర్ హిట్టైన ఈ చిత్రం చిన్నతెరపై కూడా ఒకటి రెండు సార్లు సూపర్ హిట్ అవ్వడం మాములు విషయం కాదు.

ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. చాలా మంది చూశారు. అయినప్పటికీ జెమిని టీవీ ఛానల్‌లో వచ్చిన ఈ సినిమాను ఎవరూ ఊహించన విధంగా బ్రహ్మరథం పట్టారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు రెండు నెలల గ్యాప్‌తో ఈ మూవీ రెండోసారి బుల్లితెరపై ప్రదర్శితమైంది. ఆన్‌లైన్‌లోనూ ఈ సినిమా ఉన్నప్పటికీ, బుల్లితెరపైన ప్రదర్శితమైన ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గకపోవడం గమనర్హం. మొత్తంగా స్మాల్ స్క్రీన్ పై మహేష్ బాబు కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో సరిలేరు నీకెవ్వరు సినిమా మరోసారి ఋజువు చేసింది.

సినిమా విడుదలైన 30 రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక ఆ తరవాత టీవీల్లో వస్తే ఎవరు చూస్తారు అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది కరెక్ట్ కాదని సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరు నిరూపించింది.

మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి బరిలోకి దిగిన మహేష్ బాబు బాక్సాఫీస్ దుమ్ములేపేశాడు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు రికార్డులు క్రియేట్ చేసింది.

ప్రస్తుతం మహేష్ 27వ సినిమా త్వరలో సెట్స్ కి వెల్లనుంది. ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు.

Share

Leave a Comment