టాప్ సినిమాటోగ్రఫర్ కి మహేష్ స్పెషల్‌గా

దేశంలో టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్లలో ఆయన ఒకరు. హిందీ లో బ్లాక్‌బస్టర్ చిత్రాలకి తన సినిమాటోగ్రఫీ ని ఆయువుపట్టుగా మార్చిన టాలెంట్ ఉన్న వ్యక్తి. ఆయనే రవి కె చంద్రన్.. కోలీవుడ్, బాలీవుడ్ లో చాలా పెద్ద పేరు మోసిన సినిమాటోగ్రాఫర్. మహేష్ భరత్ అనే నేను తో తెలుగు లో అరంగేట్రం చేసి తన సత్తా ఎంటో నిరూపించుకున్నారు.

ప్రొఫెషనల్ అండ్ స్టైలిస్ట్ సినిమాటొగ్రఫీ కి ఈయన పెట్టింది పేరు. మహేష్ ని ఇంతకమునుపు ఎవరూ చూపించని విధంగా చాలా అందంగా ఆండ్ క్లాసీ గా చూపించి అందరి మన్నలను అందుకున్నారు. నేడు ఈయన జన్మదినం సందర్భంగా సూపర్‌స్టార్ తన ట్విటర్ ఖాతా నుండి ప్రత్యేకంగా విష్ చేసాడు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న టాప్ మోస్ట్ సినిమాటోగ్రఫర్ ఆండ్ నా వండర్‌ఫుల్ కొలీగ్ రవి చంద్రన్ సార్ కి నా హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు. మీ గురించి నేను చెప్పనవసరం లేదు. మీరు చేసే పనే మీ గురించి అందరికి చెప్తుంది. అందుకే దేశం లోనే అత్యున్నత స్థాయి లో ఉన్నారు అని ఖితాబు ఇచ్చాడు.

మీ లెన్స్ నుండి మరిన్ని అద్భుతాలు మేము చూడాలి అని కోరుకుంటూ, ఈ సవత్సరం మీకు అన్ని విధాలుగ కలిసి రావలి అని విష్ చేస్తున్నను అని ట్వీట్ చేసారు మహేష్. రవి చంద్రన్ గారికి కూడా మహేష్ అంటే చాలా అభిమానం. నిన్న ఆయన మహేష్ గురించి ఆశక్తికరమైన ట్వీట్ చేసారు.

నిన్న ముంబయి లో ఒక యాడ్ షూట్ లో ఉండగా అక్కడికి ఒక 7 ఏళ్ళ చిన్న పిల్లాడు వచ్చాడు. మహేష్ గారికి నేను చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమాలు అన్నీ చూసాను. భరత్ అనే నేను అయితే పది సార్లు చూసాను. మీరు మహేష్ తో వర్క్ చేసారు కదా నాకు ఒక సెల్ఫీ ఇస్తారా అని అడిగాడు.

కేవలం నేను తన ఫేవరెట్ హీరో తో పని చేసా అని నాతో సెల్ఫీ దిగి మహేష్ మీద తనకి ఉన్న ప్రేమ ని నాకు తెలియజేసాడు. దీని బట్టి పిల్లలలో మహేష్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. అందరికీ ఇలాంటి అభిమానం దక్కదు అని మహేష్ ని టాగ్ చేసి పోస్ట్ చేసారు.

మ‌హేష్ బాబు సినిమా అంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న సినిమా కోసం ఆరు నుంచి అర‌వై ఏళ్ళ వారు కూడా వేచి చూస్తుంటారు. ఇక పెద్ద‌తెర‌పైనే కాదు.. చిన్నితెర‌పై కూడా. యూ ట్యూబ్‌లోనూ మ‌హేష్ బాబు సినిమాల‌కు డిమాండ్ ఫుల్లుగా ఉంటుంది. అందుకే హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీగా అమ్ముడవుతున్నాయి.

Share

Leave a Comment