బామ్మ కోరిక నెరవేరనుందట

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల్లో అమ్మాయిులు ఆండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. కాలేజ్ అమ్మాయిలు మహేష్ అంటే చాలా అభిమానం చూపుతారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మాస్ – క్లాస్ అనే తేడా లేకుండా అందరిని తన అభిమానులను చేసుకున్న మహేష్ బాబుతో సెల్ఫీ దిగాలని 106 ఏళ్ల రాజమండ్రికి చెందిన బామ్మ ఆశ పడుతోంది.

అప్పట్లో కృష్ణ అంటే – ఇప్పుడు మహేష్ బాబు అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఈ వయస్సులో కూడా మహేష్ బాబుతో కలిసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోందట. ఈ బామ్మ గురించి అభిమానుల ద్వారా మహేష్ బాబు వరకు చేరిందట. బామ్మ ఆశపడుతున్నట్లుగా ఆమెతో సెల్ఫీ దిగేందుకు మహేష్ బాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. అధికారికంగా ధ్రువీకరణ రావల్సి ఉన్నది.

ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపబోతున్నారు. ఆ సమయంలోనే ఆ బామ్మను కలిసేందుకు మహేష్ బాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అభిమానుల ద్వారా రాజమండ్రి నుండి ఆ బామ్మను హైదరాబాద్ కు రప్పించే ప్రయత్నాలు చేస్తారో లేకపోతే మరేమైన మార్గం ద్వారా ఆమె కోరిక తీరుస్తారో తెలియాల్సి ఉంది.

106 ఏళ్ల ఆ బామ్మ కోరుకున్నట్లుగా సెల్ఫీని మహేష్ బాబు ఇచ్చి ఆమెను ఆనంద పర్చబోతున్నాడన్నమాట. ఇందుకే మహేష్ కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల కోసం ఎల్లప్పుడు కొత్త రకమైన సినిమాలు చేస్తు వారు సగర్వంగా కాలర్ ఎగరేసేలా చేసే మహేష్ ఇలా వారి గురించి ఎప్పుడు తాపత్రయ పడుతూ ఉంటాడు.

అమెరికాలో ఇప్పటికే మహర్షి షెడ్యూల్ పూర్తయి యూనిట్ సభ్యులు మొత్తం హైదరాబాద్ కు తిరిగి వచ్చేసారు. కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇప్పటికే ఈ చిత్రం కోసం ఒక పల్లెటూరు సెట్ ను నిర్మించే పనిలో ఉన్నారు.

ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్‌ పాత్రలో అలరించనున్నారు. ‘మహర్షి’ మూవీ కోసం యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అభిమానుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నరు అని సమాచారం.

Share

Leave a Comment