పవర్ స్టార్ కోసం సూపర్ స్టార్..

జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలను అందజేస్తున్నారు. కొంత కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ పలు సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నారు.

ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ అందించారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్! నీ దయాగుణం మరియు వినయం ఎల్లప్పుడూ మార్పును ప్రేరేపిస్తాయి.

మీకు ఎల్లప్పుడూ ఆనందం మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు పవన్ కళ్యాణ్ తో ఉన్న ఓ అరుదైన ఫొటోను కూడా మహేష్ షేర్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ధి సోషల్ మీడియా గా నిలిచింది.

ఈ ట్వీట్ కి మహేష్ పవన్ అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ కొడుతూ రీ ట్వీట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలిద్దరూ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇదే జరిగితే అన్ని రికార్డులు అవుట్ అని మరికొందరు ట్వీట్స్ పెట్టారు.

కాగా టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ పవన్ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒకే పంథాలో ముందుకు సాగుతూ వచ్చారు. మొదటి నుంచి ఇద్దరూ సినిమా ఫంక్షన్లకి దూరంగా ఉంటూ రిజర్వుడ్ గా తమ పనులు తాము చూసుకుంటూ ఉండే మనస్తత్వం కలవారు.

ఆ తర్వాత రోజుల్లో ఇద్దరూ తమ పంధా మార్చుకున్నారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి కానీ వీరిద్దరూ ఎప్పుడూ ఒకరిపట్ల ఒకరు ఆప్యాయత చూపిస్తూ ఉంటారు. గతంలో మహేష్ నటించిన అర్జున్ సినిమా పైరసీకి సంభందించి పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి సపోర్ట్ చేశాడు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ఇటీవల కరోనా సహాయార్థం విరాళం ప్రకటించిన మహేష్ బాబు ను పవన్ మెచ్చుకున్నాడు. ఇప్పుడు లేటెస్టుగా పవన్ బర్త్ డే నాడు మహేష్ విషెస్ చెప్పి తమ మధ్య అనుబంధాన్ని మరోసారి తెలియజెప్పాడు.

పవన్ తో సినిమాలు నిర్మిస్తున్న దర్శక నిర్మాతలు కూడా కొత్త అనౌన్స్ మెంట్లతో ఈ రోజు అభిమానులను ఆనందింపజేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ నిర్మాతల నుంచి ఇప్పటికే మూడు సర్ ప్రైజ్ లు వచ్చాయి. వేణు శ్రీరామ్ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు షార్ట్ గ్యాప్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారిపాట సినిమాను ఎనౌన్స్ చేశాడు, అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

Share

Leave a Comment