సూపర్‌స్టార్ ఫ్యాన్స్ అంటే ఇది

సూపర్‌స్టార్ మహేష్ బాబు కి ఈ పుట్టిన రోజు మరింత స్పెషల్ కానుంది. ఆగష్టు 9 న ఆయన తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఇంకా సమయం ఉన్నా అభిమానులు ముందుగానే ఆయన పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నారు.

దాంట్లో భాగంగా కొద్దీ రోజుల క్రితం నుండే అభిమాన సంఘాల ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన పేరుతో అన్నదానాలు, వృద్దులకు పండ్లు మరియు వస్తువులు పంపిణీ చేయడం వంటి పనులను చేస్తున్నారు.

మహేష్ పుట్టిన రోజు ఆగష్టు 9 వరకు ప్రతీ వారం ఒక్కో జిల్లాలో ఫ్యాన్స్ అంతా కలిసి అక్కడ అన్నదానం, వికాలాంగులకి చేయూత ఇవ్వడం వంటి మంచి పనులు చేయనున్నారు. ఇలా ఫ్యాన్స్ అంటే కేవలం సినిమాల వరకే పరిమితం కాకుండా సమజానికి పనికొచ్చే పనులు చేయడం అని మహేష్ ఫ్యాన్స్ నిరూపిస్తూ అందరికి ఆదర్శంగా నిలబడుతున్నారు.

చేసిన సాయాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుని ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో తాము చేసిన మంచి పనులను కూడా ప్రచారం చేసుకోకపోవడం నిజంగా గొప్ప విషయం. మహేష్ బాబు పంధా లోనే ఇప్పుడు ఫ్యాన్స్ కుడా నడుస్తున్నారు.

సూపర్ స్టార్ కూడా సోషల్ సర్వీస్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. మహేష్ మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న మనిషి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అయన ఎంతోమందికి సాయం చేశారు.

దాంట్లో భాగంగా రెండు ఊరులని దత్తత తీసుకొని అక్కడి ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న నిరుపేద పిల్లలకు సహాయం చేసే నిమిత్తం మహేష్ బాబు రైన్ బో హాస్పిటల్ – ఆంధ్ర హాస్పిటల్స్ తో టై అప్ అయ్యాడు.

మహేష్ బాబు సైన్ చేసే ప్రకటనల ద్వారా వచ్చిన పారితోషికంలో కొంతమొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తుంతుంటారు. ఈ రోజుల్లో చిన్న చిన్న పనులకే భారీ పబ్లిసిటీ కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటిది మహేష్ బాబు ఇంతలా చేస్తున్నా..పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు.

తమ అభిమాన నటుడు అయిన మహేష్ బాబు నుండి తాము ఎంతో నేర్చుకున్నామాని ఫ్యాన్స్ కూడా సమాజానికి తమ వంతు సాయాన్ని చేయాలనే సంకల్పంతో చేస్తున్న ఈ మంచి పనులని అందరు మెచ్చుకునే తీరాలి. ఫ్యాన్స్ అంటే జస్ట్ థియేటర్ దగ్గర హంగామా చేయడానికే పనికొస్తారనేది పాత మాట. ప్రస్తుతం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

Share

Leave a Comment