ఆ లిస్ట్‌లో మహేషే టాప్

సూప‌ర్‌స్టార్ మహేష్ ఓ కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టారు. మొన్నామధ్యే సోష‌ల్ మీడియా వేదిక‌లో భాగ‌మైన ట్విట్ట‌ర్‌లో మహేష్ కు ఏడు మిలియన్ మంది ఫాలోవ‌ర్స్ రీచ్ అయ్యార‌ని సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్ రికార్డు తో పాటు ఓ హీరో కోసం ఎక్కువ మంది సెర్చ్ చేసిన వారిలో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేష్ ముందంజ‌లో ఉన్నార‌ట‌.

దక్షిణాది చిత్రసీమలో అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న మహేష్ కి దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ ఉంది. విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న యాక్టర్ మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి గురించి లేటస్ట్ న్యూస్ కోసం రోజు చాలా మంది వెతికేస్తున్నారట. మోస్ట్ సేర్చెడ్ హీరో గా కూడా మొదటి స్థానం లో నిలిచాడు

తమకు ఇష్టమైన హీరో గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి. పైగా టాలీవుడ్ ను ఏలుతున్న హీరో గురించి అయితే అందరిలోనూ ఆసక్తే. ఆయన పుట్టింది, పెరిగింది ఎక్కడ? జీవిత విశేషాలు ఏంటనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుంది. అలా మన టాలీవుడ్ టాప్ హీరో మహేష్ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారట.

ఇలా ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటుందనిపించే విధంగా దూసుకేల్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు వికీపీడీయా పేజీని రోజుకు సగటున దాదాపు 6400 మందికి పైగా ఓపెన్ చేసి చదువుతున్నారట. ఈ విషయంలో టాలీవుడ్ హీరోలందరిలోకి మహేష్ బాబే మొదటి స్థానంలో ఉన్నారు.

ఒక్కో జెనరేషన్ కి ఒక్కో పాపులర్ స్టార్ ఉంటారు. తెలుగులో మాత్రం ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తెలుగులో మాత్రమే సూపర్ స్టార్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మహేష్ ఫాలోయింగ్ సౌత్ లోనే అనుకుంటే పొరపాటు. నార్త్ లో కూడా మహేష్ క్రేజ్ చాలా చోట్ల ఎక్కువగా ఉంది. కొత్త హీరోయిన్స్ కూడా మాకు మహేష్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారంటే ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది.

‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ లాంటి సోషల్ క‌మిట్‌మెంట్స్ ఉన్న సినిమాల్లో నటించి ప్రేక్ష‌కులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తన కెరీర్లో 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్‌గా మహేష్ బాబు పాత్ర ఉంటుందట. ఇందులో మహేష్‌ బాబు స్టూడెంట్‌గా నటిస్తున్నారని ‘మహర్షి’ టీజర్‌ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share

Leave a Comment