మహేష్‌తో తమన్నా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక కర్నూల్ కొండారెడ్డి బురుజుని పోలిన సెట్ ని హైదరాబాద్ లోనే సృష్టించి ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా సరిలేరు నీకెవ్వరు గురించి ఇప్పుడు ఇంకో వార్త చక్కర్లు కొడుతుంది.

ఇందులో ఒక సాంగ్ కోసం తమన్నాను ఓకే చేసినట్లు ఒక వార్త గత కొన్ని రోజులుగా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. నిజానికి ఈ పాట కోసం ఫలానా హీరోయిన్ ను తీసుకున్నారంటూ చాలా ప్రచారం జరిగింది. కాని అనిల్ రావిపూడి తమన్నా ను ఫైనల్ గా ఓకే చేసినట్లు వార్త చక్కర్లు కొడుతుంది. అనిల్ రావిపూడి కి ఒక సెంటిమెంట్ ఉంది.

తన సినిమాల్లో హీరోయిన్ గా చేసిన వారిని తన తదుపరి సినిమాలో ఒక పాటలో తలుకున్న చూపించడం. సుప్రీమ్ లో పటాస్ హీరోయిన్ ని, రాజా ది గ్రేట్ లో సుప్రీమ్ హీరోయిన్ ను ఒక పాటలో యాక్ట్ చేసారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ సరిలేరు నీకెవ్వరు లో వర్క్అవుట్ అయినట్లుంది. తమన్నాతో ఈ ఏడాది అనిల్ రావిపూడి ఎఫ్2లో పని చేసిన సంగతి తెలిసిందే.

గతంలో మహేష్ తో తమన్నా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఫుల్ లెంత్ రోల్ లో ఆగడులో నటించిన సంగతి తెలిసిందే. దీంతో ఫైనల్ గా ఈ పాట కోసం తమన్నా నే ఎంపికైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సి ఉంది. తమన్నా ఇంతకు మునుపు అనేక సందర్భాల్లో మహేష్ నటన తనకి ఇష్టమని చెప్పారు.

ఒకసరి అవార్డు ఫంక్షన్ లో తను పర్ఫార్మ్ చేస్తూ స్టేజ్ కిందకి వచ్చి మహేష్ తో సెల్ఫీ తీసుకుని ఆ పిక్ ని నెట్ లో పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మహేష్ నటన అంటే చాలా ఇష్టం. మహేష్‌కు జోడీగా నటించాలనేది నా కోరిక. నా కోరికను నెరవేర్చింది ఆగడు. మహేష్ గారితో కలిసి యాక్ట్ చేయడం చాలా మెమొరీస్ ని ఇచ్చింది అని ఒక సారి మీడియా తో చెప్పారు తమన్నా.

కనుక ఈ వార్త నిజమైతే తమన్నా మళ్ళీ మహేష్ పక్కన తెరమీద కనిపించనుంది అనమాట. సరిలేరు నీకెవ్వరు అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా దర్శకనిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. శరవేగంగా అన్ని హంగులతో సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణ జరుగుతోంది.

ఇక దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మహేష్, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెల 12 వ తేదీ వరకు జరిగే ఈ హైదరాబాద్ షెడ్యూల్‌‌తో చిత్రంలోని మేజర్ సన్నివేశాల షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

తన 25 వ సినిమాగా మహర్షి రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. ఇప్పుడు దాన్ని మించి వుండే విధంగా సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీకి కొదవ ఉండదు. ఈ సారి ఇంకా భారీగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

మహేష్ బాబును పవర్ ఫుల్ రోల్‌లో చూపిస్తూనే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి. మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు ఎలాంటి బ్లాక్‌బస్టర్ గా నిలవనుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Share

Leave a Comment