ఆ స్థాయి కష్టం..

ప్రేమకథా చిత్రాలను తెలుగు తెరకి కొత్త కోణంలో పరిచయం చేసిన దర్శకుడు తేజ. ఇప్పుడు కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో సీత అనే సినిమాను తెరకెక్కించారు ఆయన. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నిజం సినిమాను గురించి ప్రస్తావించారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం నిజం. తన తండ్రి చావుకు కారణమైన అవినీతి, లంచగొండి అధికారులపై, సంఘ విద్రోహ శక్తులను తన తల్లి ప్రోత్సాహంతో సీతారాం అనే యువకుడు ఎలా అంతమొందించాడనేదే ఈ చిత్ర కథ.

అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే మహేష్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఉత్తమ నటుడిగా ఆయన నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు తేజ పంచుకున్నారు.

మహేష్ బాబు కాకుండా ఇంకెవరైనా కొత్త కుర్రాడు అయితే దాని రెస్పాన్స్ వేరే విధంగా ఉండేదేమో. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడానికి మహేష్ కారణం కాదు. ఎందుకంటే ఈ సినిమా కన్నా ముందు ఆయన నటించిన ఒక్కడు భారీ విజయాన్ని సాధించి సాధించి చరిత్ర సృష్టించింది.

దాంతో మహేష్ కు ఒక కమర్షియల్‌ ఇమేజ్‌ వచ్చింది. ఒక్కడు తర్వాత నిజం ఈ సినిమా విడుదల కావడంతో ఆ స్థాయికి సరిపోలేదు. రెండో కారణం ఏంటంటే నిజం సినిమాలో మహేష్ బాబు కాకుండా వేరే నటుడితో తీస్తే ఎవరూ ఆ స్థాయిలో నటించే వారు కాదు.

వేరే నటుడి నుంచి ఆ స్థాయి నటన రాబట్టుకోవడం కష్టం. మహేష్ బాబు నటనకు ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతా. ఆయన డెడికేషన్ లెవెల్స్ మరెవరికీ ఉండవు. కానీ ఆయనకు వచ్చిన స్టార్‌డమ్‌ కారణంగా సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు. బాబి తర్వాత నిజం కోసం మహేష్ ను తీసుకున్నా.

మధ్యలో ఒక్కడు వచ్చింది. అది ఎంత ఘన విజయం సాధించిందే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాని వల్ల కమర్షియల్‌ ఇమేజ్‌ పెరిగింది. తప్పు నాదీ కాదు మహేష్ బాబుదీ కాదు. ఆయన ఆడియెన్స్‌ దృష్టిలో పెద్ద హీరో అయిపోవడమే. దీన్ని దురదృష్టమని చెప్పాలి.

ఉదాహరణకు నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా చివర్లో ఉరి వేసుకునే సీన్ ఉంటుంది. అది కనుక మహేష్ వంటి స్టార్ హీరోలతో చేస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఉరి వేసుకోవడంను ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉంటేనే వర్కౌట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పరుశురాం సినిమా సరికొత్త కధతో మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

Share

Leave a Comment