ఇదిగో మీకోసమే బ్రదర్ అంటూ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి విశేష మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను టాలీవుడ్ స్టార్లు ముందుకు తీసుకెళ్తున్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు ఈ మంచి కార్యక్రమానికి మరికొంత మంది స్టార్లను నామినేట్ చేస్తున్నారు

ఆగస్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ ఛాలెంజ్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ శృతిహాసన్‌ను నామినేట్ చేశారు


మహేష్ బాబు ఛాలెంజ్‌ను స్వీకరించిన దళపతి విజయ్ మంగళవారం చెన్నైలోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో విజయ్ చాలా సింపుల్‌గా ఉన్నారు

అంతేకాదు, మహేష్‌ను గారు అని సంబోధిస్తూ ట్వీట్ చేయడం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇది మీకోసమే మహేష్ బాబు గారు. హరిత భారతం, మంచి ఆరోగ్యం కోసమే ఇది. థాంక్యూ, సురక్షితంగా ఉండండి అని విజయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు

విజయ్ ట్వీట్‌కు ఇటు మహేష్ అభిమానులు, అటు విజయ్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. విజయ్ ట్వీట్‌కు మహేష్ బాబు కూడా స్పందించారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు సోదర. సురక్షితంగా ఉండండి అని మహేష్ రిప్లై ఇచ్చారు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం, ఈ కార్యక్రమం ఇప్పుడు దేశం లో ప్రముఖలందరు బాగస్వామ్యులవుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే మనదేశం లో ఒక్క మనిషి కావాల్సిన మొక్కలు చాలా తక్కువ వాటి ద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోవడం లేదు

అందువల్ల దేశ రాజధాని లో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారు అంటే మనం మొక్కలు నాటడం లో అశ్రద్ధ చూపుతున్నాం అనడానికి నిదర్శనం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు , మనం అభిమానించే వాళ్ళు మొక్కలు నాటే విధంగా కోరడం

ఒకరి ద్వారా ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం, మొక్కలు నాటడం పైన పర్యావరణ పరిరక్షణ పైన మంచి అవగాహనా కల్పిస్తు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. ఈ ఇనీషియేటివ్ ఎంతో గొప్పదిగా అందరూ అభివర్నిస్తున్నారు

కాగా, ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే పాల్గొన్నారు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరో ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం విశేషం. ఇదిలా ఉంటే, మహేష్ నామినేట్ చేసిన వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్, శృతిహాసన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తిచేయాల్సి ఉంది

Share

Leave a Comment