ఫ్లిప్‌కార్ట్ ప్రోమోలో సూపర్‌స్టార్ అదుర్స్

తెలుగు ఇండస్ట్రీ లో అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్ గా కొనసాగుతున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్న ప్రాంతీయ భాష స్టార్ ఎవరైన ఉన్నారంటే అది కేవలం మన సూపర్ స్టార్ మహేష్ బాబు. నేషనల్ వైడ్ ఆయనికి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదు అనడంలో సందేహం లేదు.

దేశ విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న హీరో మన సూపర్ స్టార్. అందుకేనేమో పలు అంతర్జాతీయ బ్రాండ్స్ సూపర్ స్టార్ మహేష్ తో తమ్ ప్రొడక్ట్స్ కు ఎండార్స్మెంట్ చేయించుకుంటాయి. రెండు డజన్ల పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వన్ ఆండ్ ఓన్లీ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఆయన ఖాతాలో మరో అంతర్జాతీయ బ్రాండ్ ‘ఫ్లిప్ కార్ట్’ చేరింది.

పండుగల సీజన్‌ నేపథ్యంలో ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌లో ‘ది బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ ప్రారంభించనుంది. ఈ సేల్‌ కోసం సెలబ్రిటీలు మహేష్ బాబు, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణే, విరాట్‌ కోహ్లితో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. రీజనల్ యాక్టర్స్ నుండి కేవలం మహేష్ ఒక్కడే ఈ లిస్ట్ లో ఉన్నాడంటే ఆయనకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు.

ఇండియా వైడ్ పాపులర్ స్టార్స్ తో టై అప్ అయి ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ మరింత ప్రమోట్‌ చేయనుంది. అందులో భాగంగా సూపర్‌స్టార్ మహేష్ ప్రోమో ని రీసెంట్ గా విడుదల చేసింది ఫ్లిప్‌కార్ట్. ఈ ప్రోమో లో మహేష్ తనదైన శైలి లో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అందరినీ అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో టాక్ ఆఫ్ థ సోషల్ మీడియా గా నిలిచింది. అభిమానులందరూ షేర్ల మీద షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

మహేష్ క్రీమ్ కలర్ షర్ట్ వేసుకుని పైకి చూస్తూ ప్రాబ్లెంస్ అన్ని డిస్‌ప్లే అవుతున్నట్టు ఈ ప్రోమో ని చిత్రీకరించారు. బడ్జెట్, టెన్షన్స్, బ్యాలెన్స్, ఎక్స్‌పెన్స్ మొదలగు ప్రశ్నలకి తగ్గట్టు గా మహేష్ చూస్తూ వీటికన్నిటికి సమాధనాం ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ అని వాటిని పక్కకి నెట్టడం ద్వారా తెలియజేసాడు.

సినిమాలు, యాడ్స్ రెండింటిని మహేష్ సమంగా ప్లాన్ చేసుకుంటాడు. మహేష్ బాబు గ్లామర్ రహస్యం అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. దూకుడు సినిమాలో డైలాగ్ ప్రకారం హాలీవుడ్ రేంజ్ కు మహేష్ ఏమాత్రం తగ్గడు. అందుకేనేమో పలు అంతర్జాతీయ బ్రాండ్స్ మహేష్ తో తమ్ ప్రొడక్ట్స్ కు ఎండార్స్మెంట్ చేయించుకుంటాయి.

తెలుగు హీరోల్లో ఇన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన వారు లేరు. అలాగే ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకున్న హీరోల జాబితాలోనూ మహేష్ నంబర్ వన్ గా నిలిచారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు టోటల్ సౌత్ ఇండియా లోనే మహేష్ ప్రధమ స్థానం లో ఉన్నాడు. ఆయన బ్రాండ్ వాల్యూ కి దరిదాపుల్లో కూడా మరే హీరో లేరంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది.

Share

Leave a Comment