మనందరి కోసం భరత్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ ని దర్శకుడు కొరటాల శివ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమా గానే కాకుండా మనం జీవితం లో కొన్ని మంచి విషయలాని కూడా నేర్పించే అద్భుతమైన చిత్రం గా తెరకెక్కించారు.

ఈ చిత్రం నుండి మనం కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. ఈ జీవిత సత్యాలని మనం అలవరుచుకుంటే లైఫ్ లో సక్సెస్ ట్రాక్ లోకి వెల్లడమే కాకుండా మన మానసిక వికాసానికి కూడా దోహదపడుతుంది.

ప్లానింగ్ ఆండ్ ప్రిపరేషన్ : (మహేష్ బాబు తన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ని ఏర్పాటు చేసే సన్నివేశం)

మహేష్ తను ముఖ్యమంత్రి అయిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా కొంచెం డిలే చేసి తరువాత పెడతాడు. ఆ మీటింగ్ లో సభ్యులతో కావాలనే లేట్ గా మీటింగ్ పెడుతున్నాను ఎందుకంటే నేను ముందు అన్ని విషయాలు తెలుసుకుని గ్రౌండ్ వర్క్ చేసాకే పెడిటే బవుంటుంది అనుకున్నా అని చెప్తాడు.

ఈ సన్నివేశం ద్వార మనం ఏమైన పని చేసేముందు మనకి దాని గురించి కొంచెం అయినా అవగాహన ఉండాలి. ప్లానింగ్ ఆండ్ ప్రిపరేషన్ అవసరమని, మనం కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి అలోచించి చేయాలి అనే గొప్ప సత్యాన్ని తెలియజేసారు.

అకౌంటబిలిటీ / జవాబుదారితనం : (మొదటి సన్నివేశం నుండి చివరి వరకు ప్రామిస్ ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూనే ఉంటాయి)

ప్రామిస్ ప్రాముఖ్యత మీదనే ఈ సినిమా అంతా నడుస్తుంది. చిన్నప్పటి నుండి తల్లి తనకి నేర్పించిన విలువలని పాటిస్తూ భరత్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇంకా సినిమా మొదటి సన్నివేసం నుండి చివరి వరకు మనకి అకౌంటబిలిటీ ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూనే ఉన్నారు.

మహేష్ బాబు హీరోయిన్ తండ్రి దగ్గరికి వెళ్ళి జరుగుతున్న పరిణామాలన్నింటికీ నేనే కారణం అని ఒప్పుకునే సీన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సన్నివేశం మనకి మన తప్పులని ఒప్పుకొని బాధ్యత వహించాలని అనవసరంగా పక్కన వాల్ల మీదకి నెట్టకూడదనే సత్యాన్ని మనకి నేర్పుతుంది.

పనులని వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేయడం : (మహేష్ బాబు ట్రాఫిక్ టీం తో మీటింగ్ ఎరేంజ్ చేసే సన్నివేశం)

దీనినే ఇంగ్లీష్ లో ప్రోక్రాస్టినేషన్ అంటారు. మహేష్ ట్రాఫిక్ టీం తో మీటింగ్ ఎరేంజ్ చేయమంటే, తప్పకుండా రేపు ఎరేంజ్ చేద్దామని తన చీఫ్ సెక్రెటెరీ అంటాడు. దానికి మహేష్ ‘ఏం..ఈ రోజు కుదరదా అని అంటాడు.’

నిజ జీవితం లో మన అందరికీ పనులని వాయిదా వెస్తూ ఆ చేద్దాం లే నెమ్మదిగా అని పోస్ట్ పోన్ చేసే తత్వం ఎక్కువ. ఇది మనలో చాల మందికి హ్యాబిట్ అయిపోయింది. ఈ ఆలసత్వం ని వదిలి పనులని ఎప్పటికప్పుడు పూర్థి చేయాలి అనే గొప్ప సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. మనందరి కోసం భరత్ చెప్పే జీవిత సత్యాలు ఇవి.

Share

Leave a Comment