మాస్ క్లాస్ తేడా లేకుండా అదరకొట్టేసింది

‘భరత్ విజన్’ లోనే భరత్ అనే నేను పవర్ చూసేశాం. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో మరోసారి మహేష్ సూపర్ హిట్ కొట్టబోతున్నాడంటూ సూపర్‌ స్టార్ అభిమానులు ఫిక్స్ అయ్యారు.

ఇక భరత్ అనే నేను ట్రైలర్ ‘ది జర్నీ ఆఫ్ భరత్’ కూడా వచ్చేసింది. శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన భరత్ బహిరంగ సభలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.

ఇది ఓ ముఖ్య‌మంత్రి క‌థ అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. ఆ మూడ్‌కి త‌గ్గ‌ట్టుగానే ప్ర‌చారం జ‌రుగుతోంది. ట్రైల‌ర్‌లో కూడా.. ‘ఆ సీరియెస్ నెస్‌’ పుష్క‌లంగా క‌నిపించింది.

భ‌ర‌త్ అనే సీఎమ్‌.. ఏటిట్యూడ్‌, అత‌నికి ఎదుర‌య్యే స‌వాళ్లు, దాన్ని దాటుకుని వ‌చ్చే త‌త్వం, రాజ‌కీయాల్లో ఉన్న కుళ్లు కుతంత్రం ఇవ‌న్నీ ప్ర‌తీ ఫ్రేమ్‌లోనూ క‌నిపించేలా ట్రైల‌ర్ డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.

ఈమ‌ధ్య కాలంలో ఓ స్టార్ హీరో చేసిన ఇంత సీరియస్ ఫిల్మ్ ఇదేనేమో అనిపించేలా ఉంది ట్రైల‌ర్‌. డ్యూయెట్ల‌కు, కామెడీ పంచ్‌ల‌కూ స్థానం లేకుండా ఇంటెన్సిటీ చెడ‌గొట్ట‌కుండా ద‌ర్శ‌కుడు చాలా జాగ్ర‌త్త తీసుకున్నాడ‌నిపిస్తోంది.

యాక్ష‌న్ ప్రియుల‌కు కావ‌ల్సినంత మ‌సాలా ఉంద‌న్న సంగ‌తి ఒకే ఒక్క షాట్‌తో అర్థ‌మ‌వుతోంది. సూపర్‌ స్టార్ మ‌హేష్ ఓ రౌడీని భుజాన వేసుకుని స్టైలీష్‌గా న‌డుచుకొస్తున్న షాట్‌ ఈ ట్రైల‌ర్ కే హైలెట్‌.

రాజ‌కీయాల్ని, ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ల్ని, చ‌ట్ట స‌భ‌ల్లో మ‌న ప్ర‌జా ప్ర‌తినిథుల ప‌నితీరుని మార్చ‌గ‌లిగే ముఖ్య‌మంత్రి ఎలా ఉంటాడో, ఎలాంటి ముఖ్య‌మంత్రిని చూడాల‌ని అనుకుంటామో స‌రిగ్గా అలాంటి క‌థ‌ని వండి వార్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక నేప‌థ్య సంగీతం, విజువ‌ల్స్‌, డైలాగుల్లో ఎమోష‌న్ ఇవ‌న్నీ కొర‌టాల శివ మార్కుకి త‌గ్గ‌ట్టే ఉన్నాయి. ఎ రిఫార్మర్‌, ఎ స్టేట్స్‌మెన్‌, ఎ గార్డియన్‌, ఎ మ్యాన్‌ ఫర్‌ ది కామన్‌ మ్యాన్‌, టేక్స్‌ ఎన్‌ అన్‌కామన్‌ పాథ్‌ అంటూ ఆంగ్ల అక్షరాలను ప్లే చేస్తూ మరింత రక్తికట్టించారు.

‘త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్లను చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా’ అంటూ మహేష్ ఇచ్చిన ఫైనల్ పంచ్ అదుర్స్ అనిపించింది.

Share

Leave a Comment