విజయ్ కి అండగా మహేష్..

ఈ సంక్షోభం స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి చేయూత‌గా నిలిచేందుకు సినీ ప్ర‌ముఖులు త‌మ చేత‌నంత సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట నిధిని ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసరాలు అందజేస్తున్నారు విజయ్.

విజ‌య్ చేస్తున్న సాయంపై కొన్ని వెబ్‌సైట్స్ త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించాయి. తాను చేస్తోన్న సామాజిక సేవను ప్రశ్నిస్తూ తనపై తప్పుడు వార్తలు రాసిన వెబ్‌సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం విజయ్ దేవరకొండ ఒక వీడియోను విడుదల చేశారు. తన పై రాసిన తప్పుడు వార్తల గురించి ఆయన క్షుణ్ణంగా వివరించారు.

ఇండస్ట్రీ మీద ఆధారపడి నడిచే ఆయా వెబ్‌సైట్లను నడుపోతన్న సదరు వ్యక్తులు తమ ఇష్టమొచ్చినట్టు తప్పుడు వార్తలు రాస్తున్నారని విజయ్ మండిపడ్డారు. ఇలాంటి వార్తలను నమ్మొద్దని అలాంటి వెబ్‌సైట్లను బహిష్కరించాలని ప్రజలకు విజయ్ పిలుపునిచ్చారు.

అయితే ఈ విషయంలో విజయ్‌కు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తోంది. విజయ్‌కు అండగా తాను ఉంటానని సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించడంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రస్తుతం టాక్ ఆఫ్ థి టౌన్ గా మారింది. నీ వెనుక నేనున్నా బ్రదర్ అంటూ మహేష్ ట్వీట్ చేయడంతో ఆ వెబ్‌సైట్లపై సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వస్తోంది.

ప్రజల ప్రేమ గౌరవాన్ని పొందడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ కృషి సహనం మోహం త్యాగం ఉంటుంది. నీ భార్యకు మంచి భర్తగా ఉండటానికి నువ్వు పనిచేస్తావు. నీ పిల్లలు కోరుకున్నట్టు సూపర్ హీరో తండ్రిగా ఉంటావు. నీ అభిమానులు కోరుకునే సూపర్ స్టార్‌గా ఉంటావు.

అయితే ఎవ‌రో ఒక వ్యక్తి డబ్బు కోసం నిన్ను అగౌర‌వ‌ప‌ర‌చ‌డం త‌ప్పుడు వార్త‌లు రాయడం చేస్తుంటాడు. పాఠ‌కుల‌కి త‌ప్పుడు వార్త‌లు అందిస్తాడు. అందమైన మన తెలుగు సినిమా పరిశ్రమను రక్షించాలని నేను కోరుకుంటున్నాను. నా అభిమానులను కాపాడాలని నేను కోరుకుంటున్నాను.

ఇవన్నీ సహ‌జం అని భావిస్తోన్న సమాజం నుంచి నా పిల్లలను రక్షించాలని కోరుకుంటున్నాను. తప్పుడు వార్తలు రాస్తూ తమను అగౌరపరుస్తూ సమిష్టిగా తమపై అబద్ధాలను ప్రచారం చేస్తోన్న ఈ ఫేక్ వెబ్‌సైట్స్‌‌పై చర్యలు తీసుకోవాలని పరిశ్రమను కోరుతున్నాను. కిల్ ఫేక్ న్యూస్ కిల్ గాసిప్ వెబ్‌సైట్స్ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మహేష్ బాబు తో పాటు కొరటాల శివ సుకుమార్ వంశీ పైడిపల్లి అనిల్ రావిపూడి రవితేజ తదితరులు విజయ్‌కు అండగా ఉంటామని ట్వీట్లు చేశారు. ఈ సమస్యను లేవనెత్తడంపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ ఒక్కటి కావాల్సిన తరుణమిదని వీరంతా తమ ట్వీట్లలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఈ స‌మ‌యంలో అంతా క‌లిసి క‌ట్టుగా పోరాడాల్సి ఉంద‌ని అన్నారు. మ‌రి ఈ విష‌యాన్ని సినీ పెద్ద‌లు సీరియ‌స్‌గా తీసుకొని త‌ప్పుడు వార్త‌లు రాసే వెబ్‌సైట్స్‌పై చ‌ర్య‌లు తీసుకుంటుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Share

Leave a Comment