టాలివుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్

అతడి చిరునవ్వులు అభిమానుల ఆనందాలు…ఆటపట్టిస్తూనే అమ్మాయిల మనసుల్ని దోచుకునే పోకిరి. బాక్సాఫీసు వద్ద ఖలేజా చూపిస్తూ, తనదైన దూకుడుతో రికార్డులను తిరగారయడంలో నంబర్ వన్ నేనే అంటూ రియల్ శ్రీమంతుడునని నిరూపించానుకున్నాడు ప్రిన్స్. విభిన్నమైన సినిమాలతో, స్టైలిష్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరిరిస్తూ భరత్ గా జవాబుదారితనం ప్రాముఖ్యతని తెలియజేసాడు.

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలిగిన నటుడు టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. అందం, అభినయం, ప్రయోగాత్మక కథలతో బాక్సాఫీసును షేక్ చేసే సినిమాలు, ఆకట్టుకునే అభినయానికి వరించిన అవార్డులు. ఇది మహేష్ గురించి సింపుల్ గా చెప్పాలంటే.

నటశేఖర కృష్ణ, ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబు,నాలుగేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా నీడ సినిమాతో పరిచయమయ్యాడు. దర్శకేంద్రుడు కె.రాఘవెంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు.

మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్, నిజం, టక్కరి దొంగ, నాని, 1 నేనొక్కడినే లాంటి ఎక్స్ పరిమెంటల్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి మల్టీస్టారర్ మూవీస్ కి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.

టాలీవుడ్ టాప్ హీరోగా అలరిస్తున్న సూపర్ స్టార్ కు ఓవర్సీస్ లో వున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. అలాగే పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అక్కడ నెంబర్ వన్ నేనే అని నిరూపించుకున్నాడు ప్రిన్స్. విభిన్నమైన సినిమాలతో, వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న మహేష్ బాబు 8 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను అందుకున్నాడు.

40 ఏళ్ళు దాటిన, ఇంకా కాలేజ్ కుర్రాడిలా తన చరిష్మాతో అలరిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం ప్రతిష్టాత్కమైన తన 25వ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేస్తుండగా, ఈ సినిమా అభిమానులకు మరచిపోలేని తీపి గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు.

టాలివుడ్ లో మిస్టర్ పెర్ఫెక్ట్ అని ఎవరినైన సంభోదించాలి అంటే అది మహేష్ నే అని అందరూ చెప్పే మాట. మహేష్ బాబు రానున్న రోజుల్లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడం తో పాటు కొత్త కొత్త కధలతో టాలివుడ్ రేంజ్ ని మరింత విస్తరిస్తాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.

Share

Leave a Comment