ఇండియా వైడ్ క్రేజ్ !!

శంకర్, రాజమౌళి, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఇండియా డైరెక్టర్స్ విలువని నార్త్ ఇండియా లో నిలబెట్టిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తే చాలు. ముఖ్యంగా శంకర్, రాజమౌళి లతో సినిమాలు చేస్తే చాలు ఆల్ ఇండియా లెవెల్లో మార్కెట్ వచ్చినట్లే.

ఈ జనరేషన్ సౌత్ స్టార్ హీరోస్ కూడా అందుకే వీళ్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఈ లిస్ట్ లో ఉన్న ఏ ఒక్క దర్శకుని తో కూడా కలిసి సినిమా చేయకపోయినా ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న తెలుగు హీరో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు మాత్రమే.

మహేష్ బాబు చేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలని రీమేక్ చేసి ఇతర భాషా హీరోలు, డైరక్టర్లు భారీ విజయాలు నమోదు చేసుకున్నారు. పోకిరి సినిమా చేసి అటు తమిళ హీరో విజయ్ ఇటు బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ వాంటెడ్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ ని అడిగినా సూపర్‌స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేయాలని ఉంది అంటారు.

మహేష్ బాబు తో సినిమా చేయాలని బాలీవుడ్, కాలీవుడ్ మేకర్స్ కూడా చాలా సార్లు ట్రై చేశారు కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. అయితేనేం మహేష్ రికార్డులు కొట్టడం మాత్రం ఆపలేదు. కేవలం తనకే సొంతమైన అనేక రికార్డులని కొల్లగొట్టడమే కాకుండా తెలుగు చిత్రాలకి అంతర్జాతీయ మార్కెట్ లో ఎవరికీ అందని రేంజి కి తీసుకెల్లాడు.

ఓవర్సీస్ లో మహేష్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓవర్సీస్‌ ప్రేక్షక హృదయాల్లో మహేష్‌కు చాలా గొప్ప స్థానం ఉంది. అమెరికాలో అత్యధిక ఒక మిలియన్ డాలర్ సినిమాలు కలిగిన హీరోల్లో సౌత్ ఇండియాలోనే మహేష్ ప్రథమ స్థానంలో ఉన్నారు. అలాంటి మహేష్ సినిమా వస్తుందంటే ఓవర్సీస్ లో పండగ వాతావరణం నెలకొంటది.

రాజమౌళితో సినిమా చేయకుండా నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరో మహేష్ మాత్రమే. ఒక ఇండస్ట్రీ అని సంబందం లేకుండా ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీల నటుల్లో కూడా కొందరు మన సూపర్ స్టార్ కు వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అంత తిరుగులేని ఫాలోయింగ్ మహేష్ బాబు కి సొంతం.

నేషనల్ మ్యాగజైన్లు అనగానే సహజంగా హిందీ స్టార్లకు, బాలీవుడ్ బ్యూటీలకే ప్రాధాన్యం ఉంటుంది. ఇక కవర్ పేజిలపై దాదాపుగా వారే ఉంటారు. అయితే ఈసారి ప్రఖ్యాత మ్యాగజైన్ వోగ్ వారు సౌత్ పై దృష్టి సారించారు. వోగ్ అక్టోబర్ కవర్ పేజీపై సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ తో అదరగొట్టిన విషయం తెల్సిందే.

పాన్ ఇండియా సినిమా చేయకున్నా అంతకుమించిన ఫేమ్ తెచ్చుకున్న మహేష్ తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడా అని ఇప్పటికే మీడియా వర్గాలు గెస్ వర్క్ మొదలుపెట్టేసాయి. అందులో భాగంగానే ఇటీవలే బ్లాక్‌బస్టర్ అందుకున్న క్రేజీ డైరెక్టర్ త్వరలో మహేష్ కి కధ వినిపించనున్నాడని మీడియా వర్గాలు ప్రచురిస్తున్నాయి.

ఇదే జరిగితే పాన్ ఇండియా మొత్తం మహేష్ నామస్మరణ జరుగడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడ కుండానే మీడియా వర్గాలు మాత్రం ఇలాంటి ఊహగానాలతో రోజుకో న్యూస్ రాస్తుంది అంటే మహేష్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నారు. చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ మొదటి సారి ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో రెండు సర్ప్రైజ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి మాస్ ప్రేక్షకులకు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఫుల్ మీల్స్ గ్యారంటీ అన్నమాట. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దానికి మించిన స్పీడ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి.

కమర్షియల్ ఎంటర్టైనర్లను మలచడంలో స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మహేష్ కు మరో బ్లాక్ బస్టర్అందించడం ఖాయమని సినీ ప్రేమికులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా, రేపు సంక్రాంతికి రిలీజ్ అయిన తరువాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.

Share

Leave a Comment