పక్కా ప్రొఫిషనల్ అండ్ వెరీ స్వీట్

దశాబ్ద కాలంపాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో నటించి హిట్ అందుకుంది త్రిష. అందం తోనే కాకుండా అభినయం తో కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం టైటిల్ రోల్ పాత్రల్లో కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తోంది.

త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని విషయాలను పంచుకుంది. మహేష్ బాబుతో ‘అతడు’, ‘సైనికుడు’ చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది త్రిష. ఇంతకీ మహేష్ గురించి త్రిష ఏం చెప్పిందో మీరు కూడా చదివేయండి.

మహేష్ చాలా స్పెషల్. నాకు నచ్చిన హీరోల్లో మహేష్ బాబు ఒకరు. తనతో అతడు సినిమా చేసేటప్పుడు తోటి ఆర్టిస్ట్‌గా నాకు మంచి గౌరవం ఇచ్చేవారు. మహేష్ చాలా కామ్‌గా ఉంటారు. తనపనేదో తాను చేసుకుంటూ పోతారు.

అతడు సినిమా చేస్తున్న సమయంలో ఒక విషయం గమనించాను. ఉదయం నుండి రాత్రి పదింటి వరకు తన సీన్స్ షూటింగ్ లేకున్నా కూడా సెట్‌లోనే ఉండేవారు మహేష్. ఆయన సీన్స్ లేకున్నా కూడా సెట్‌లో ఉండి ఎవరిని డిస్టర్బ్ చేసేవారు కాదు. అది చాలా గొప్ప విషయం.

అసలు కార్‌వాన్‌లోకి కూడా వెళ్ళేవారు కాదు, అలాంటి స్టార్ హీరో సెట్స్‌లో ఉంటే నేను ముందు వెళ్ళిపోతే ఎం బాగుంటుంది అని చాలా సార్లు అలా సెట్లోనే ఉండిపోయేదాన్ని. మహేష్ పనికి ఎలాంటి విలువ ఇస్తారో నాకు తెలుసు అని వివరించింది. మహేష్ ని చూసి తాను చాలా సార్లు గిల్టీ గా ఫీల్ అయ్యాను అని, మహేష్ కమిట్ మెంట్ చాలా గొప్పది అని కొనియాడింది.

ప్రిన్స్ పక్కా ప్రొఫిషనల్, స్వీట్ సూపర్ స్టార్ అంటూ ప్రశంసలు కురిపించింది త్రిష. అతడు చిత్రంలో పల్లెటూరి పిల్లగా మహేష్ సరసన జోడీగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరూ సైనికుడు మూవీలో కలిసి వర్క్ చేసారు.

అతడు సినిమాలో చేసిన పూరి పాత్రను ఇంకా మరచిపోలేకపోతున్నానని, అతడు ఒక క్లాసిక్ అని అలాగే ఆ సినిమాలో తనతో చేసిన మహేష్ బాబు ఒక బెస్ట్ కో-స్టార్ అంటూ పొగిడేసింది. సూపర్ స్టార్ మహేష్ కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ అందగాడే కాదు అంతకుమించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు అన్నది తనతో పనిచేసిన వారు చెప్పే మాట.

Share

Leave a Comment