మరో రెండు రోజుల్లో

ఒకప్పుడు ఓ సూపర్ హిట్ సినిమా బుల్లితెర ఫై చూడాలంటే కనీసం ఆరు నెలలు, ఏడాది వరకు ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా రెండు నెలలకే బుల్లితెర ఫై ప్రీమియర్ గా ప్రసారం అవుతున్నాయి. ఇక ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోవడం తో రకరకాల ఆన్లైన్ టెలికాస్ట్ సంస్థలు వెలుగులోకి వచ్చాయి.

ఆన్‌లైన్ ప్రసార హక్కులను ఎక్కువ మొత్తం లో కొనుగోలు చేసి, దానిని సినిమా రిలీజ్ అయినా యాభై రోజుల లోపే ఆన్లైన్ చూసేందుకు వీలు కలిపిస్తున్నారు. అలాంటి సంస్థలో అమెజాన్ ప్రైమ్ ఒకటి. ప్రస్తుతం చాల సినిమాలను అమెజాన్ కొనుగోలు చేస్తుంది.

ఇక తాజాగా మరో సూపర్ హిట్ చిత్రాన్ని ప్రసారం చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. మహేష్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను చిత్రాన్ని జూన్ 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో టెలిక్యాస్ట్ అవ్వనుంది.

ప్రస్తుత రోజుల్లో ఓ సినిమా 50 రోజుల పాటు ధియేటర్లలో ప్రదర్శితం అవ్వడం అంటే చాలా గొప్ప విషయం. సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఆ ఫీట్ ను అందుకునే కోవలో పయనిస్తోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.

ఇటు ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డ్స్ ని తిరగరాసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో విడుదల చేసి వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెజాన్. భారి ధరకి ఈ బ్లాక్‌బస్టర్ మూవి డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే

ఇప్పటికే యూ ట్యూబ్ లో విడుదలైన ఫుల్ వీడియో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే అన్ కట్ సీన్స్ కి కూడా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇంటర్నెట్ స్ట్రీమింగ్ లో భరత్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

నిన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంట పడిన సూపర్ స్టార్ కూల్ గా బియర్డ్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చారు. గెడ్డం లుక్ లో మహేష్ నిజంగా పిచ్చెక్కిస్తున్నాడనే చెప్పాలి. బ్లూ కలర్ షర్ట్ లో బ్లాక్ కలర్ అడిడాస్ క్యాప్ పెట్టుకున్న మహేష్, కొద్దిగా మీసం, గడ్డం పెంచి కొత్తగా కనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share

Leave a Comment