మహర్షి టైటిల్‌లో ఇవి గమనించారా

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమా ఫస్ట్ లుక్, మహేష్ లుక్ టీజర్ అతని పుట్టినరోజు సందర్భంగా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండిటికీ మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పటికే ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్లుగా ఖుష్ అయ్యారు.

సూపర్ స్టార్ కాలేజ్ స్టూడెంట్ లుక్ తో పాటు మహర్షి టైటిల్ పై, లోగో డిజైన్ పై సోషల్ మీడియా లో చర్చలు సాగుతున్నాయి. ముందు నుంచి ఈ టైటిల్ రివీల్ చేయడంలో చాలా క్రియేటివిటీగా ప్లాన్ చేసిన వంశీ పైడిపల్లి ఇక పోస్టర్ లో టైటిల్ డిజైన్ లో మరిన్ని ప్రత్యేకతలు చూపించి ఆకట్టుకున్నారు.

వంశీ పైడిపల్లి మహర్షి టైటిల్ విషయంలో కూడా అలాగే తన క్రియేటివిటీని ఉపయోగించి సినిమా కథ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేసారు. టైటిల్ లోగో డిజైన్ పై ఇప్పటికే ఫ్యాన్స్ దాదాపుగా రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ అని ఎందుకు పెద్ద పదం అంటారా. అలా చేయకపోతే లోగో లో ఉన్న అతి చిన్న డీటెయిల్స్ కనబడవు కదా.

టైటిల్ లోగో లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఎక్కడ ఉందో గమనించారా మీరు? టైటిల్ లో ‘ర్షి’ అక్షరంలో ‘ష’ వొత్తు పైనా చివరన పరిశీలనగా చూడండి. మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనబడుతుంది. మరొకటి ఏంటంటే ‘ర్షి’ ని మీరు గమనిస్తే ‘రిషి’ అనే మహేష్ బాబు పాత్ర పేరు కనిపిస్తుంది.

ఇక ‘మహర్షి’ టైటిల్ లోగో కింద బ్లాక్ & వైట్ నీడ లాగా ఎత్తైన భవంతులు కనిపిస్తాయి అంటే అది అమెరికా. లోగో పైనెమో కొబ్బరి చెట్లూ, పొలాలు కనిపిస్తాయి. మన గ్రామాల్లో సాధారణంగా కనిపించే దృశ్యం అది. మధ్యలో ‘మహర్షి’ టైటిల్, అంటే ఆ రెండిటికీ వారధి గా మహేష్ పాత్రను డిజైన్ చేశారన్నమాట.

ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుదు చెప్పబోయేవి ఇంకో లెవెల్. ‘మ’ అక్షరం పైన చూస్తే మీకు ఒక గన్ కనిపిస్తుంది. అలాగే ‘హ’ అక్షరాన్ని పరీక్షగా చూస్తే ఒక కత్తి కనిపిస్తుంది. వీటితో పాటు గన్ మరియు ర అక్షరం కింద మీకు కొన్ని మ్యాథ్స్ కు సంబంధించిన కొన్ని ఈక్వేషన్లు కనిపిస్తాయి. ఇవన్నీ ఫ్యాన్స్ కనిపెట్టిన సంగతులు.

టైటిల్ నే ఇంత క్రియేటివ్ గా డిసైన్ చేస్తే ఇంక సినిమా ని వంశీ పైడిపల్లి ఇంక ఎంత ఆలోచించి తీస్తున్నారో. శ్రీమంతుడు తర్వాత మరోసారి మహేష్ స్టూడెంట్ గా ‘మహర్షి’లో కనిపిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పాత్రలో నటించి, మరల స్టూడెంట్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన మహేష్ క్యారెక్టరైజేషన్, దానికి తగ్గట్లు అతని లుక్స్ కూడా ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి.

Share

Leave a Comment