మొదటి రోజు చాలా స్పెషల్

భరత్ అనే నేను చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు. నటించారు అనడం కంటే జీవించేసారు అనడం ఉత్తమం. ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ ఆయన నటనకి. భరత్ లాంటి ముఖ్యమంత్రి తమకి ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు ఫీలయ్యారు.

అందుకే ఆ చిత్రం 200కోట్ల కలక్షన్స్ రాబట్టింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మహేష్ నెక్స్ట్ సినిమాని మొదలెట్టారు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తెరక్కనున్న మహేష్ 25 వ మూవీ షూటింగ్ నిన్నటి రోజు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో మొదలైంది. మహేష్, పూజ హెగ్డే, అల్లరి నరేష్ తో పాటు మరికొంతమంది నటీనటులు ఇందులో పాల్గొన్నారు.

కాలేజీలో జరిగే ఈ సన్నివేశాలను 20 రోజుల పాటు షూట్ చేయనున్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వయంగా షూటింగ్ స్పాట్ కి వెళ్లి మహేష్ బాబుని కలిశారు.

రియల్ ముఖ్యమంత్రికి రీల్ ముఖ్యమంత్రి స్వాగతం పలికిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న విషయం అక్కడి ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ అయింది. మహేష్ బాబు, దర్శకులు వంశీ పైడిపల్లిలను కలిసి డెహ్రాడూన్‌లో షూటింగ్ పూర్తయ్యే వరకు సహకరిస్తామని తెలిపారు.

కాగా, మహేష్ బాబు, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రనాథ్ సింగ్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడి షూటింగ్ కి సంబందించిన వీడియో ని కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం శాఖ అఫీషియల్ గా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. మహేష్ అభిమానులు సైతం ఈ విషయాన్నీ గర్వంగా చెప్పుకుంటున్నారు.

అశ్విని దత్, దిల్ రాజులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ గా కనిపించన్నారు. శర వేగంగా సినిమా పూర్తి చేసి సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకే తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కెరీర్లో 25వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Share

Leave a Comment